పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీని రిలీజ్ కు రెడీ చేశారు. వచ్చేనెల 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత పవన్ .. ఒకే సారి రెండు సినిమాల్ని పట్టాలెక్కించారు. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలోని ‘హరిహర వీరమల్లు’ ఫోక్ లోర్ మూవీ అయితే.. మరొకటి మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మూవీ. దీనికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన పవర్ స్టార్ పిక్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో పవన్ సాధారణ దుస్తుల్లో రివీలయ్యారు. ఈ పిక్ చూస్తుంటే.. సినిమాలో పవర్ స్టార్ ఇంటికి సంబంధించిన సెట్ అనిపిస్తోంది. మరో హీరోగా రానా నటిస్తున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇక ఇందులో ఐశ్వర్యా రాజేశ్, నిత్యామీనన్ కథనాయికలుగా నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Must Read ;- కుర్రకారు కేరింతలతో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్











