పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ ఎలా ఉండబోతున్నాడన్న సస్పెన్స్ కు తెరపడిపోయింది. ఫస్ట్ లుక్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ గ్లింప్స్ చూసి పవన్ అభిమానులు ఫిదా అవ్వాల్సిందే. హరిహర వీరమల్లుగా పవర్ స్టార్ పైనుంచి దూకే సన్నివేశం వావ్ అనిపిస్తుంది. పవర్ స్టార్ హీరోయిజాన్ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసేలా సినిమా రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’ లాంటి హిట్ నిర్మించిన సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎం. రత్నం చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా ఇది. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రకరకాల పేర్లు తెరమీదకు వచ్చాయి.
మొదట్లో దీన్ని ‘విరూపాక్ష’ అన్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఫిలింఛాంబర్ లో కూడా ఈ పేరునే రిజిస్టర్ చేయించారు. ఇది చారిత్రక కథాంశంతో రూపొందుతోంది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ కు ఇలాంటి కథ తొలి ప్రయత్నం అనాలి. రాబిన్ హుడ్ తరహాలో బందిపోటుగా నటిస్తున్నట్లు చెబుతున్నారు. పీరియాడికల్ డ్రామా అయినా దీనికి కోసం చార్మినార్, తాజ్ మహల్ లాంటి సెట్ లలో సినిమా చేస్తున్నారన్న ప్రచారం ఉంది.
దీనికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే సంకల్పంతో చిత్ర యూనిట్ పనిచేస్తోంది. సాధారణంగా క్రిష్ తను అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేస్తారన్న నమ్మకం అందరిలోనూ ఉంది. ఇది 100 కోట్ల బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా సినిమా అయినా క్రిష్ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కావలసిందే. పవర్ స్టార్ లుక్ తో పాటు ఈ సినిమా టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ‘హరిహర వీరమల్లు’గానే ఈ టైటిల్ ను నిర్ణయించారు. విడుదల చేయాల్సిన అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్ ఉంది.
Must Read :
Prepare for the EPIC Adventure of Legendary Heroic Outlaw!🔥
Presenting you Power Star @PawanKalyan in & as #HariHaraVeeraMallu 🤩
▶️https://t.co/kzRr31Df3U@DirKrish @AgerwalNidhhi | @mmkeeravaani | @AMRatnamOfl | @ADayakarRao2 | @gnanashekarvs | @saimadhav_burra | @venupro
— Mega Surya Production (@MegaSuryaProd) March 11, 2021