ఎనర్జిటిక్ స్టార్ రామ్ .. ఈ సంక్రాంతికి ‘రెడ్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించాడు. ఆశించిన రీతిలో ఈ సినిమా మ్యాజిక్ చేయకపోవడంతో .. అభిమానులు ఎంతగానో నిరాశచెందారు. ఈ నేపథ్యంలో రామ్ తదుపరి చిత్రాల విషయంలో చాలా కేర్ఫుల్ గా అడుగులేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే కథల్ని ఎంపిక చేసుకుంటున్నాడు.
తాజాగా తమిళ దర్శకుడు లింగుసామి రూపొందించే బైలింగ్విల్ మూవీలో మాస్ అపీరెన్స్ ఇవ్వబోతున్నాడు రామ్ . అలాగే మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కారణంగా తన మేకోవర్ ను కూడా అందుకు తగ్గట్టుగానే మలుచుకుంటున్నాడు. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేయబోతున్న ఈ యాక్షన్ మూవీపై భారీ అంచనాలున్నాయి.
ఇక దీని తర్వాత రామ్ నటించబోయే సినిమాలో మల్లూ కుట్టి, కన్నుకొట్టుడు సుందరి గా పేరు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికగా నటించబోతుండడం విశేషంగా మారింది. నితిన్ చెక్ మూవీలోని గెస్ట్ అపీరెన్స్ తో .. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియా.. తేజ సజ్జా హీరోగా నటించిన ‘ఇష్క్’ సినిమాలో కూడా కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు రామ్ త్వరలో నటిస్తున్న మారుతి సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్ గా ఎంపికైందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కిస్తున్న మారుతి .. తదుపరిగా రామ్ తోనే సినిమా తీయబోతున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాలో రామ్ సరసన మల్లూ సుందరి ఏ రేంజ్ లో మెరుస్తుందో చూడాలి.
Must Read : యశ్ చేయాల్సిన సినిమాలో ప్రభాస్ ?











