ఏ కథ ఏ హీరోని చేరుతుందో తెలియదు. అలా వెళ్ళిన కథలు ఆ హీరోలే చేస్తారని గ్యారెంటీ లేదు. ఎన్నో గొప్ప సినిమాల కథలు అలా చేతులు మారినవే. ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న సలార్ కథ కూడా ఒక హీరోని దాటుకొని వచ్చిందట. ఆ హీరో మరోవరో కాదు .‘కేజీఎఫ్’ తో పాన్ ఇండియా స్టాటస్ తెచ్చుకున్న కన్నడ హీరో యశ్. ఇప్పుడు కేజీఎఫ్ రెండో భాగంతో ఫుల్ బిజీగా ఉన్నాడు అతడు. ఇక అసలు విషయానికొస్తే .. నిజానికి ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమా కథ ముందుగా యశ్ కు వినిపించాడట దర్శకడు ప్రశాంత్ నీల్.
‘కేజీఎఫ్, సలార్’ కథలు రెండూ ఒకేసారి యశ్ కు వినిపించగా.. అందులో అతడు కేజీఎఫ్ కథను ఎంపికచేసుకున్నాడట. ఒకవేళ ‘కేజీఎఫ్’ మూవీలో ప్రభాస్ నటించి ఉండుంటే.. అతడి ఇమేజ్ కోసం అందులో ఇంకా ఛేంజెస్ ఉండేవేమో. ఏది ఏమైనా యశ్ చేయాల్సిన సలార్ లో ప్రభాస్ నటిస్తూండడం విశేషాన్ని సంతరించుకుంది. ‘కేజీఎఫ్ 2’ ఇంకా విడుదల కాకుండానే.. సెట్స్ మీదకు వెళ్లిన ‘సలార్’.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుంది. మరి ఈ సినిమా ప్రభాస్ కు ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్ తో పోటీపడుతున్న ఆ ఇద్దరూ ఎవరు?