సోనూసూద్ నిత్యం వార్తల్లో వ్యక్తి. ఆయన కేవలం పత్రికల పతాక శీర్షికలకు మాత్రమే కాదు. బోర్డుల మీదికి కూడా ఎక్కుతున్నారు. ఆయన పేరుతో మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ముంబాయిలో ప్రారంభం అయింది. నిజానికి ఈ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించింది ఓ బామ్మ కావడం విశేషం. దీనికి సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
పూణెలోని గోసావి వస్తి ప్రాంతంలో శాంతా బాలు పవార్ అనే 85 ఏళ్ల ముసలమ్మ కొన్నాళ్ల కిందట హఠాత్తుగా స్టార్ అయిపోయింది. ఆమె కర్ర సాము గరిడీలు చేస్తున్న ఒక వీడియో హఠాత్తుగా ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఒక చిన్న పూరిగుడిసెలో ఉంటున్న శాంతాబాలు పవార్, కుర్రకారు కూడా విస్తుపోయేలా సునాయాసంగా చేసిన కర్రసాము చూసిన ప్రతి ఒక్కరూ విస్తుపోయారు.
ఆమె తన సాము గరిడీలు ప్రదర్శించి భిక్షాటన సాగించడం ద్వారా 20 మంది సభ్యులున్న కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెకు సాయం అందించడానికి చాలామందే ముందుకొచ్చారు. ఇలాంటి విషయాల్లో అందరికంటె ముందుండే సోను సూద్ కూడా ఆమెకు భారీగా ఆర్థిక సహాయం అందించారు. ఆ సాయం ఆమెలో కొత్త శక్తిని ప్రేరేపించింది. పుణెలో ఆమె మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ను ప్రారంభించింది. ఆ రకంగా తనకు తెలిసిన విద్యను శాంతా బాలు పవార్.. నలుగురికీ పంచడానికి ఒక వేదిక లభించినట్లయింది. వినాయకచవితి రోజున ప్రారంభించిన ఈ మార్షల్ ఆర్ట్స్ స్కూలుకు సోనూసూద్ పేరు పెట్టి శాంతా బాలు.. తన అభిమానాన్ని చాటుకుంది.
సోనూసూద్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించిన బామ్మ… రోడ్లపై తనకున్న విద్యతో భిక్షాటన చేస్తున్న 85 ఏళ్ల శాంతబాలుపవర్ దీనావస్థ చూసి చలించిపోయిన సోనూసూద్ ఆమెకు ఆర్థికసాయం చేసి ఓ ట్రైనింగ్ స్కూల్ పెట్టేలా ప్రోత్సహించారు. సోనూసూద్ సహాయంతో పుణెలో సోనూసూద్ పేరుతో మార్షల్ ఆర్ట్స్ స్కూల్ వినాయకచవితి రోజున ప్రారంభించింది,మార్షల్ ఆర్ట్స్ స్కూల్ కి సోనూసూద్ పేరు పెట్టి సోనూపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది బామ్మ……..
Posted by నా నోట రిపోర్టర్ మాట on Sunday, 23 August 2020