మార్వెల్ అభిమానులకు విందు చేసేందుకు ‘ఎటర్నల్స్’ సిద్దమవుతోంది. ఈ సినిమా టీజర్ ను మార్వెల్ స్టూడియోస్ ఈ రోజు విడుదల చేసింది. ఆస్కార్ విజేత క్లో జావో దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇది కూడా సూపర్ హీరోలతో చేసే ప్రయోగమే. సల్మా హాయక్, ఏంజెలీనా జోలీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటులు రిచర్డ్ మాడెన్, కిట్ హారింగ్టన్ లు ఇందులో నటించారు. వీరితో పాటు పాకిస్తాన్ నటుడు కుమాయిల్ నంజియాని కూడా ఓ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమాని నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ వాయిస్ ఓవర్ ప్రధానంగా ఉంది. సల్మా హాయక్ వాయిస్ గొంతుతో పలికే డైలాగులు ఉన్నాయి. ‘మేం చూశాం… మార్గనిర్దేశం చేశాం. వారు ముందుకు వెళ్లడానికి మేం సహాయం చేశాం. కొన్నేళ్ల నుంచి
ఇప్పటిదాకా మేము జోక్యం చేసుకోలేదు’ అనే డైలాగ్ తో ఉన్న టీజర్ ఇది. సముద్రం దగ్గర నిరాశలో ఉన్న ప్రజల దగ్గరకు ఓ అంతరిక్ష నౌక చేరుకోవడం,
అందులో ఉన్న సూపర్ హీరోలు అక్కడి ప్రజలు వ్యవసాయం చేసుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించడాన్ని మనం ఇందులో చూస్తాం. వారిలో ఆశలు రేకెత్తినా చివర్లో ఏదో విధ్వంసం జరిగినట్లుగా చూపారు. దీని వెనుక సంగతులేంటి అనేది సినిమాలో చూడాల్సిందే. భారతీయత కనిపించేలా ఈ టీజర్ ఉంది.
Must Read ;- నివీన్ పాలీ మలయాళ యాక్షన్ మూవీ ‘తురముఖం’ టీజర్ అదిరింది!