తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో హైదరాబాదులోనే వైద్య పరీక్షలు చేయించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేయించుకోనున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు జరగనున్నాయి.
గతంలో అనేక పుకార్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆరోగ్యం సవ్యంగా లేదని గతంలో పలుమార్లు పుకార్లు వ్యాపించాయి. ఢిల్లీ టూర్ వెళ్లి.. కొన్నిరోజుల పాటు ఆయన అక్కడ బసచేసిన ప్రతి సందర్భంలోనూ, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని, చికిత్స చేయించుకుంటున్నారని రకరకాల పుకార్లు వ్యాప్తిలోకి వచ్చేవి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇవేవీ నిర్ధరణ కాలేదు. తాజాగా.. ఊపిరితిత్తుల్లో మంట రావడంతో.. హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించనున్నారు.










