పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. పాన్ ఇండియా మూవీ ‘సలార్’ మూవీని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్ లో ‘ఆదిపురుష్’ మూవీని ‘సలార్’ మూవీ కంటే ముందుగానే ప్రకటించారు.
‘ఆదిపురుష్’ సినిమాని 2022లో ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్టు కూడా ఎనౌన్స్ చేశారు కూడా. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ‘సలార్’ మూవీని సెట్స్ పైకి తీసుకువస్తుండడంతో ‘ఆదిపురుష్’ మీద సందేహాలు తలెత్తాయి. అంతలోనే ఈ సినిమా డైరెక్టర్ ఓంరౌత్ క్లారిటీ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ఓంరౌత్ స్పందిస్తూ.. ‘ఆదిపురుష్’ మూవీని ఈ నెలాఖరున సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలియచేశారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటిస్తుంటే… బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నాడు. సీతగా కృతిసనన్ నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతోంది. భూషణ్ కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సూతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Must Read ;- ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పోస్టర్ అదరహో