మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ టీజర్ కోసం మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు వాయిదా పడుతూనే వచ్చింది. ఆఖరికి స్వయంగా చిరంజీవే.. టీజర్ రిలీజ్ చేస్తావా..? లేక లీక్ చేసేయమంటావా.? అని డైరెక్టర్ కొరటాలకు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ నెల 29న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తానని మాటి ఇచ్చిన కొరటాల చెప్పినట్టుగానే ఈరోజు ఆచార్య టీజర్ ను రిలీజ్ చేశారు.
కొరటాల సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే సందేశం ఉంటుంది. ఆచార్య సినిమాని కూడా సమాజానికి కావాల్సిన మంచి మెసేజ్ తో రూపొందిస్తున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. ధర్మస్థలి నేపథ్యంలో సాగే కథ ఇది. ఊరు.. అందులోని టెంపుల్.. ఆచార్యగా చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ కట్ చేసిన టీజర్ అదిరింది. చిరు గెటప్, డైలాగ్ కి తగ్గట్టుగా మెలోడి బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు.
రామ్ చరణ్ ఇటీవలే ఆచార్య సెట్ లో జాయిన్ అయ్యాడు. అందుకనే అనుకుంట చరణ్ పాత్రను ఈ టీజర్ లో చూపించలేదు. అయితే.. చరణ్ కనిపించకపోయినా.. అతని వాయిస్ ని వినిపించడం విశేషం. ఈ టీజర్ అదరిపోవడంతో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేయడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య చిత్రాన్ని మే 13న భారీ స్ధాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజరే ఈ రేంజ్ లో ఉంటే.. ఇక ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో..? సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో..? బాక్సాఫీస్ వద్ద తండ్రికొడుకులు చిరు – చరణ్ కలిసి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- మణిశర్మ మాయాజాలంగా శాకుంతలం











