మెగాస్టార్ ‘ఆచార్య’ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4. 05 గంటలకు విడుదల కాబోతోంది. మెగాస్టార్ అభిమానులకు ఇది పండగే. మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ చేస్తున్న మొదటి ప్రయత్నమిది. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ధర్మస్థలి ద్వారాలు ఈ నెల 29న తెరుచుకోబోతున్నాయంటూ ఈ సినిమా అప్ డేట్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆచార్య పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఆచార్య ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. ఆచార్య టీజర్ న్యూయర్ కి వస్తుంది అనుకోవడం రాకపోవడం.. ఆతర్వాత సంక్రాంతికి కూడా వస్తుందని అభిమానులు ఎదురు చూడడం తెలిసిందే.
ఇక రిపబ్లిక్ డేకి పక్కా అనుకుంటే.. ఆరోజు కూడా రాలేదు. దాంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ లో జోష్ నింపడానికి అన్నట్టుగా చిరంజీవి కొరటాల పై సీరియస్ అయినట్టుగా మీమ్ రూపంలో పోస్ట్ పెట్టారు. తన మూవీ టీజర్ రిలీజ్ ని సరికొత్తగా ప్రమోట్ చేసి ట్రెండ్ క్రియేట్ చేశారని చెప్పచ్చు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆచార్య టీజర్ ఎప్పుడు అనేది ఎనౌన్స్ చేస్తానని చెప్పిన కొరటాల చెప్పినట్టుగానే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆచార్య టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో ప్రకటించారు.
ఇంతకీ.. ఎప్పుడంటే.. ఈ నెల 29న సాయంత్రం 4.05 నిమిషాలకు ఆచార్య టీజర్ రిలీజ్ చేయనున్నామని కొరటాల చెప్పారు. అన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేశాం. మా హార్డ్ వర్క్ ను టీజర్ లో చూస్తారు. అద్భుతం అనేలా టీజర్ ఉంటుంది. ధర్మస్థలి డోర్స్ ఈ నెల 29న 4.05 నిమిషాలకు ఓపెన్ కానున్నాయి అంటూ టీజర్ రిలీజ్ కానున్న ముహుర్తాన్ని కొరటాల ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. మరి.. టీజర్ యూట్యూబ్ లో ఏ రేంజ్ లో వ్యూస్ రాబడుతుందో..? ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో.?
Must Read ;- ప్రమోషన్స్ లో చిరు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారుగా











