తాప్సీ .. తమన్నా తరువాత అంతటి మేనిఛాయ కలిగిన కథానాయికగా మెహ్రీన్ కనిపిస్తుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ‘ సినిమా చూసిన వాళ్లంతా, పిల్ల ‘పింక్ డైమండ్’లా ఉందంటూ ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. జేబులో డబ్బులు అయిపోయేంతవరకూ సీట్లో నుంచి కదిలేది లేదు .. థియేటర్ ను వదిలేదు లేదు అన్నట్టుగా కూర్చుండిపోయారు. యూత్ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లంతా, ఆ సినిమా నుంచి ఆమె అభిమానులుగా మారిపోయారు .. ఆరాధకులుగా మిగిలిపోయారు.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మెహ్రీన్ గ్లామర్ కి గుర్తింపు వచ్చింది. అవసరమైనంత అభినయం ఉంది చాలనుకునే క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆమె చేసిన ‘మహానుభావుడు’ .. ‘ రాజా ది గ్రేట్’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలకి ఆమె నటనలో కాస్త మెళకువలు నేర్చుకుంది. అలాగే గ్లామర్ పరంగా కూడా తనని తాను మరింత అందంగా తీర్చిదిద్దుకుంది. దాంతో ఆమె అభిమానుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. దండయాత్రకు వెళుతున్నారేమో అన్నంత ఉత్సాహంగా కుర్రాళ్లు ఆమె కోసం థియేటర్లకు వెళ్లడం మొదలైంది.
అలాంటి సమయంలోనే ‘ఎఫ్ 2‘ సినిమాలో ‘హనీ’ పాత్రలో ఆమె మరింత మురిపించింది. ఇక ఈ అమ్మాయి హవా సాగడం ఖాయమని అనుకుంటే, వరుస ఫ్లాపులు రావడం మొదలుపెట్టాయి. ఈ సమయంలో ‘ఎఫ్ 3’ సెట్స్ పైకి వెళ్లడం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమైంది. అయితే ఇటీవల మెహ్రీన్ బాగా సన్నబడింది. ఆ కారణంగా ఆమెలో మునుపటి ఆకర్షణ తగ్గింది. ఆ కళ్లలో మెరుపు .. నవ్వులో నాణ్యత కూడా తగ్గాయి. అందువలన ఆమె మళ్లీ బరువు పెరిగితేనే బావుంటుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి మెహ్రీన్ వినిపించుకుంటుందో .. లేదో!.
Must Read ;- మెహ్రీన్ బరువు పెరగాల్సిందే అంటున్న ఫ్యాన్స్!











