అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ సరైన విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ.. వర్కవుట్ కావడం లేదు. ఆ మధ్య ‘మళ్లీ రావా’ సినిమాతో సక్సెస్ సాధించడంతో ట్రాక్ లోకి వచ్చాడు అనిపించింది. వరుసగా సినిమాలు చేశాడు కానీ.. ఏ సినిమా కూడా విజయాన్ని అందివ్వలేదు. అయితే.. తనకు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు కానీ.. వేరే హీరోల్లో ముఖ్యపాత్ర చేయడానికి కూడా రెడీ అని ఎప్పుడో ప్రకటించాడు సుమంత్. ఇన్నాళ్లకు సుమంత్ కోరుకుంటున్నట్టుగా వేరే హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అదే.. దుల్కర్ సల్మాన్ సినిమాలో అని వార్తలు వస్తున్నాయి.
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచె మనసు సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి.. దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ అనే పాత్రలో కనిపించనున్నారు. 1964లో జరిగిన పీరియాడిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఓ సెట్ వేస్తున్నారు. ఇందులో దుల్కర్ తో పాటు ఎప్పుడూ ఉండే ఓ క్యారెక్టర్ లో సుమంత్ కనిపించబోతున్నారని సమాచారం. ఇది ఫుల్ లెంగ్త్ రోల్ అని తెలుస్తోంది. మరి.. ఇదే కనుక నిజమైతే.. ఈ సినిమాతో అయినా సుమంత్ కెరీర్ లో మార్పు వస్తుందేమో చూడాలి. ‘సత్యం’లాంటి విజయం కోసం సుమంత్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు.
Must Read ;- చైతన్య లవ్ స్టోరీకి పది భారీ ఆఫర్స్ వచ్చాయా.?











