వాళ్లంతా.. వలస కూలీలు. పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం వచ్చారు. దొరికిన పనులు చేసుకుంటూ.. వచ్చిన డబ్బులతోనే కుటుంబాలను నెట్టుకొచ్చే పరిస్థితులు. అంతా సవ్యంగా సాగుతున్న వాళ్ల జీవితాలను లాక్ డౌన్ అస్తవ్యస్తంగా చేసింది. సొంతూళ్లకు బయలు దేరే క్రమంలో 8 మంది గల్లంతు అయ్యారు. ఈ సంఘటన విశాఖలోని సీలేరులో జరిగింది.
ఒడిశాకు చెందిన వలస కూలీలు ఉపాధి కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చారు. అయితే లాక్ డౌన్ ఉండటంతో సొంతూళ్లకు వెళ్లాలనుకున్నారు. సీలేరు నుంచి రెండు పడవల్లో బయలుదేరారు. మొత్తం 11 మంది వరకు ఉన్నారు. వెళ్లిన కొద్దిసేపటికీ బోట్లు తిరగబడ్డాయి. దీంతో 8 మంది గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో చిన్నారి డెడ్ బాడీ దొరికింది. పోలీసులు అక్కడ వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. గల్లంతైనవాళ్ల కోసం శ్రమిస్తున్నారు.
Must Read ;- తాక్టే ఎఫెక్ట్ : రాయిని ఢీకొట్టిన నౌక..270 మంది గల్లంతు