మైలు దూరం నడవాలంటే అడుగు తీసి అడుగు వేయాల్సిందే. నటనలో మెగా అడుగులు కూడా అంతే. మెగాస్టార్ చిరంజీవి నట ప్రయాణం జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి, అక్కడి నుంచి సూపర్ హీరో స్థాయికి సాగిన సంగతి తెలిసిందే. స్వయంకృషితోనే ఆయన ఈ స్థాయికి ఎదిగారు.
మద్రాసు టీ నగర్ లో విజయరాఘవ స్ట్రీట్ లోని చిన్న గది నుంచి చిరంజీవి నట ప్రయాణం సాగిన సంగతి తెలిసిందే. అవకాశాల కోసం కాలి నడకన ప్రయాణం సాగించిన రోజుల నుంచి స్కూటర్ పై తిరిగే వరకూ, ఆ తర్వాత కారు కొనే వరకూ చిరంజీవి తొలినాళ్ల ప్రయాణం సాగింది. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు, మనవూరి పాండవులు, జాతర.. ఇలా వరసగా చిరంజీవికి అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమా అవకాశం వచ్చాక నటుడు హేమసుందర్ తో చిరంజీవికి పరిచయం పెరిగి ఆయన స్కూటర్ పై వెనక కూర్చుని ప్రయాణం సాగించేవరకూ సాగింది.
First Car Of Megastar Chiranjeevi :
చిరంజీవి మొట్టమొదటిసారిగా కొన్న కారేమిటో తెలుసా? అది ఫియట్ కారు. తన తల్లిదండ్రులు, సోదరులు ఎవరైనా వస్తే ఆ కారులోనే చిరంజీవి తిప్పేవారట. ఆయన ‘జాతర’ సినిమా చేసిన తర్వాత చిరంజీవి తల్లి అంజనాదేవి, సోదరి విజయదుర్గ మద్రాసుకు వచ్చారట. వారు జాతర సినిమా ప్రివ్యూ చూడాలంటే నిర్మాతను అడిగి వారిని ఆ ఫియట్ కారులోనే సినిమాకి తీసుకొచ్చారు.
వారికి బస ఏర్పాటు కూడా జాతర నిర్మాత రుద్రరాజు సీతారామరాజు ఇంట్లో ఏర్పాటుచేశారు. ఈ విషయాన్ని ఆ నిర్మాత లియో ఇంటర్వ్యూలో వెల్లడించారు. కారు కొనడానికి ముందు హేమసుందర్ స్కూటర్ మీద వెనక కూర్చుని చిరంజీవి ప్రయాణించడాన్ని తాను చూశానని ఆయన చెప్పారు. అలా ఫియట్ కారుతో మొదలైన చిరంజీవి జీవితం అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కొనేవరకూ వెళ్లింది.
ఆయన దగ్గరున్న కార్లేమిటి?
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇప్పుడు చాలా కార్లే ఉన్నాయి. ఆయన యువహీరోగా వెలిగే రోజుల్లోనే ఓ ఇంపోర్టెడ్ కారు కొన్నారు. దాని డోర్ కూడా పైకి లేచేవి. ఓ సినిమాలో కూడా ఆ కారు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. ఆయన మొదట కొన్న ఫారిన్ కారు హోండా అకార్డ్. చిరంజీవి దగ్గరున్న రోల్స్ రాయిస్ కారు ధర రూ. 3.34 కోట్లు.
ఇక ఆయన పుట్టిన రోజుకు రామ్ చరణ్ కానుకగా ఇచ్చిన కారు టయోటా ల్యాండ్ కూజర్. దీని ధర రూ. 1.19 కోట్లు. దీని మొదటి వెర్షన్ కూడా మెగాస్టార్ దగ్గరుంది. రేంజ్ రోవర్ వోగ్ కూడా చిరంజీవి దగ్గర ఉంది. దీని ధర కూడా కోటి పైమాటే. ఫియట్ కారుతో మొదలైన చిరంజీవి జీవితం ఎంత విలాసవంతమైన కార్లలోకి మారిందో కదా.
Must Read ;- చిరు బాబీ సినిమా గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్