పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి నుంచి అంధకారం నెలకొంది.కరెంటు తక్కువ ఓల్టోజ్ రావడంతో లైట్లు వెలగలేదు.దీంతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న70 మంది కరోనా రోగులు గగ్గోలు పెట్టారు. కొందరు రోగులు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ఫోన్ చేయడంతో ఆయన హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. జనరేటర్ నడిపించే ప్రయత్నం చేశారు.అందులో డీజిల్ లేక అది కూడా పనిచేయలేదు.వెంటనే ఎమ్మెల్యే తన సొంత డబ్బుతో డీజిల్ తెప్పించి జనరేటర్ నడిపించారు. దీంతో కరోనా రోగులు గాలి పీల్చుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 70 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నా,కరెంటు సరఫరా విషయంలో తలెత్తిన లోపాలు సవరించేందుకు ఒక్క డాక్టరు కూడా ముందుకు రాలేదు.విద్యుత్ సరఫరా అధికారులకు కొందరు ఫిర్యాదు చేసినా 3 గంటల సేపు పట్టించుకోలేదు.దీంతో కొందరు రోగులు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ఫోన్ చేశారు.ఆయన వెంటనే పది నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నారు. డీజిల్ తెప్పించి జనరేటర్ నడపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.










