ఆసక్తికరమైన కథాకథనాలతో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో కొత్త దర్శకుడు అప్పు యన్. భట్టతిరి డైరెక్టర్ చేసిన ఈ సినిమా ఆద్యంతం కట్టి పడేస్తుంది. సాధారణంగా మలయాళ సినిమాల విషయంలో ఉన్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే.. కథనం స్లోగా ఉంటుంది. అంతకన్నా ఈ సినిమాలో వేరే కంప్లైంట్స్ ఏమీ లేవు.
ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడు.. రాసుకున్న మర్డర్ స్టోరీస్ షాకింగ్ గా అనిపిస్తాయి. అంతేకాదు అందులో మెన్షన్ చేసిన లొకేషన్స్ లైవ్ లో ఉంటాయి. అందుకే చాలా విచిత్రంగా అనిపించిన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని.. ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయిన హీరో. ఆ కుర్రోడు నయనతార కొడుకు. అసలు ఆ కిడ్ కి ఆ స్టోరీస్ ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? అనే యాంగిల్ లో హీరో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఆ ప్రయత్నంలో కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు హీరో. తీగెలాగితే డొంకంతా బైట పడుతుంది.
నిజానికి ఇలాంటి పాయింట్ మీద ఇప్పటి వరకూ ఏ దర్శకుడూ సినిమా తీయలేదు. ఒక చిన్న పాయింట్ .. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం జరిగిన మర్డర్స్ వెలుగులోకి రావడానికి కారణమవుతుంది. ఇది ఎవరూ ఊహించని విషయం. అదే సినిమాకి హైలైట్ పాయింట్. కుంచాకో బోబన్, నయనతార, సైజు కురుప్పు , లాల్ ప్రధాన పాత్రలు పోషించిన నిళల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.