తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. నాలుగు రోజుల క్రితం కరోనా లక్షణాలు ఉన్నాయని తేలడంతో గుంటూరులోని ఓ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. దీనికితోడు ఆమెకు ఊపిరితిత్తుల సమస్య ఉండటం, అది కాస్త తీవ్రం కావడంతో వెంటనే హైదరాబాద్ కు బయలుదేరారు. ప్రస్తుతం ఆమె కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్యం విషమంగా ఉందంటూ ప్రచారం జరగడంతో, ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కాగా ఏపీలో గత 24 గంటల్లో మరోసారి 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నమోదైన 4157 కేసుల్ని పరిశీలిస్తే తూర్పుగోదావరిలో అత్యధికంగా 617 కేసులు నమోదయ్యాయి.
Must Read ;- విజృంభిస్తోన్న కరోనా.. వెయ్యిమందికి పైగా మృత్యువాత











