ప్రజలకు బాధ కలిగిన సమయంలో రాజకీయ నాయకులు వారి వద్దకు వెళ్లి పరామర్శించడం ఎక్కడైనా జరుగుతుంది. తమకు కష్టం కలిగినప్పుడు తమ నాయకుడు వచ్చి కాస్త భరోసాగా ఉన్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. అందుకనే మొన్న జగన్ రెడ్డి కూడా విజయవాడ వరదల సమయంలో పులివెందుల నుంచి వచ్చి విజయవాడలో బురద నీళ్లలో దిగి షో చేశారు. చంద్రబాబు రాత్రింబవళ్లు వరద నీటిలో తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెబుతుంటే.. క్రెడిట్ అంతా ఆయనకు వెళ్లిపోతుందనే ఉద్దేశంతో జగన్ రెడ్డి హుటాహుటిన వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చారు.
సాధారణంగా గెలిచిన నాయకుడే కాదు.. ఓడిన లీడర్ కూడా ప్రజలను పరామర్శించేందుకు వస్తారు. కానీ, గుడివాడలో మాత్రం అలా జరగలేదు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గంలో లేకపోయినా సరే.. ప్రజలతో శభాష్ అనిపించుకుంటుండగా.. కొడాలి నాని లోకల్ గా ఉండి కూడా బాధితుల వద్దకు వెళ్లడం లేదు. ప్రస్తుతం వెనిగండ్ల రాము అమెరికాలో ఉన్నారు. అయినప్పటికీ.. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అందుతున్న సేవలను నిరంతరం అక్కడి నుంచే తన టీమ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
ఈ నెల 4న రాము అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇది ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కావడం.. పైగా ఆయన వెళ్లే సమయానికి వరద ప్రభావం లేకపోవడంతో ఆయన అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి బాగానే ఉన్న గుడివాడ.. ఆ మరుసటి రోజు నుంచి కొంత వరదలకు ప్రభావితమైంది. అయినా.. వెనిగండ్ల రాము తన టీమ్‌తో సమర్థంగా ఇక్కడ పనులు చక్కబెట్టారు. లోతట్టు ప్రాంతాలైన గుడివాడ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరికీ ఆహారం, తాగునీటిని ఏర్పాటు చేశారు.
అయితే, రాము లేకపోయినప్పటికీ ఏ లోటు లేకుండా అన్ని సహాయక చర్యలు జరిగాయి. కానీ, కొడాలి నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. మామూలుగా ఇలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ప్రత్యర్థి నేత రెచ్చిపోతారు. పైగా ప్రజలు ఇంత బాధలో ఉంటే ఎమ్మెల్యే లేడు.. అంటూ ప్రచారం చేస్తారు. అలాంటిది కొడాలి నాని సహా అసలు వైసీపీ నాయకుల జాడ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎవరూ వైఎస్ఆర్ సీపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టలేదు. మరి కారణాలు ఏమైనా.. కొడాలి నాని బయట కనపడితే జనాలు రాళ్లతో కొడతారనే ఉద్దేశంతోనే ఆయన బయటికి రాలేదని అంటున్నారు.











