టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే తిరుపతిలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్ర బృందం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు మోహన్ బాబుపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో ఈ రోజే మొదలైంది. ఫిలింనగర్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలోని అధిక భాగం షూటింగ్ ను ఇక్కడే తియనున్నాడు దర్శకుడు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే ను మోహన్ బాబు స్వయంగా సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని అంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇందులోని మోహన్ బాబు పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని, ఇదివరకు ఎప్పుడు ఆయన ఇలాంటి పాత్రలో నటించలేదని తెలుస్తోంది.
మొదటి నుండి ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం కథా బలం అనే చెప్పాలి. ఇప్పటికే మోహన్ బాబుపై ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం ఆ అంచనాలను మరింత పెంచాయి. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మంచు ఫ్యామిలీకి సరైన హిట్ తగిలి చాలా కాలమే అయ్యింది. ఈ చిత్రంతోనైనా సక్సెస్ టేస్ట్ చేస్తారేమో చూద్దాం.
Must Read ;- మోహన్ బాబు సెలెక్టివ్ గా వెళుతున్నారా?