మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ‘బరోజ్’ . ఇటీవల ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ మమ్ముట్టి , లెజెండరీ డైరక్టర్స్ ఫాజిల్, ప్రియదర్శన్, సినిమా కెమేరా మేన్ సంతోష్ శివన్ , నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్, యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ విచ్చేశారు. మోహన్ లాల్ జ్యోతి ప్రకాశనం చేశారు. మోహన్ లాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయం తెలియచేశారు.
పోర్చుగీస్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ మూవీ‘బరోజ్’. 400 సంవత్సరాలుగా వాస్కోడిగామా నిధికి కాపలా కాసే భూతం బరోజ్. ఆ నిధికి అసలైన వారసుడి కోసం ఎదురు చూస్తున్న ఆ భూతాన్ని వెతుక్కుంటూ ఓ కుర్రోడు వస్తాడు. బరోజ్ తో ఆ కుర్రోడి ప్రయాణమే ఈ సినిమా మిగతా కథ. ఇందులో బరోజ్ అనే భూతంగా మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. మరో ప్రత్యేక పాత్రను పృధ్విరాజ్ సుకుమార్ పోషిస్తున్నాడు. మలయాళంలో రూపొందిన తొలి త్రీడి సినిమా కుట్టి చేతన్ (తెలుగులో చిన్నారి చేతన) కి రచన చేసిన జీజో ఈ సినిమాకి రచన చేస్తున్నాడు. అతి త్వరలోనే బరోజ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో విడుదల కాబోతోంది.
Must Read ;- అఖిల్ సినిమాలో మోహన్ లాల్?
Barroz pooja photos
#Barroz #Jijo @antonypbvr @aashirvadcine pic.twitter.com/P3PqQBi59N— Mohanlal (@Mohanlal) March 24, 2021