తెలుగు భాషగా సుసంపన్నం చేసేందుకు ఏర్పాటైన ‘తెలుగు అకాడమీ’ పేరును మారుస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు భాషాభిమానులకు షాక్ గురిచేస్తోంది. ఇక ఏపీలో ‘తెలుగు అకాడమీ’ తన ఆస్థిత్వాన్ని కోల్పోతుందనే విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందని, తెలుగు భాషను నిర్వీర్యం చేసేలా కుట్ర జరిగిందని మండిపడుతున్నారు. రెండు రాష్ట్రాలు వేరయినా.. విభజన హామీలు నేటికీ కొనసాగుతున్నాయి. అకాడమీపై ఏకాభిప్రాయం తేలకపోముందే.. జగన్ ప్రభుత్వం పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
తెలుగు జాతికి అవమానం
తెలుగు అకాడమీ పేరు మార్చడం జగన్ రెడ్డి భావ దారిద్ర్యానికి నిదర్శనమని పలువురు విద్యావంతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన భాషగా తెలుగు వర్ధిల్లుతూ ఉంటే.. తెలుగు భాషను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం తెలుగు ప్రజానీకానికి అవమానకరనమేని అన్నారు. జగన్ రెడ్డికి తెలుగు భాష గౌరవం, తెలుగు విశ్వవిద్యాలయం గొప్పతనం తెలియకపోవడం తెలుగు ప్రజల దురదృష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే.. తెలుగు జాతిని అవమానించినట్టేనని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు, ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.
అమ్మ భాష అంటే అలుసా..
సీఎం జగన్ అనాలోచిత చర్యల వల్ల తెలుగు భాష నిర్లక్ష్యమవుతోందని రఘురామరాజు మండిపడ్డారు. దేశ భాషలందు తెలుగు లెస్స.. అనే విషయం సీఎం జగన్ మరిచిపోయినట్టు ఉన్నారని తెలుగు ప్రాధాన్యతను గుర్తు చేశారు. తెలుగు ప్రజల అభిప్రాయం లేకుండా అకాడమీ పేరు ఎలా మారుస్తారని సీఎం జగన్ ను నిలదీశారు. తెలుగు భాషను పలుచన చేయడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతెలుగువారందరూ వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. తెలుగును నిర్లక్ష్యం చేయడం వల్ల మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని, ఇప్పటికైనా భాషాభిమానులు, ప్రజలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని రఘురామరాజు డిమాండ్ చేశారు.
Must Read ;-ఎన్టీఆర్ ఆశయానికి తూట్లు.. అయినా ఆమె నోరిప్పరే











