ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకు రఘురామరాజుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడంపై ఎంపీ రాంమ్మోహన్ నాయుడు లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఒక నేరస్థుడుని అరెస్టు చేసినట్టు ప్రజలచేత ఎన్నోబడిన ఎంపీని అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఎంపీ రఘురామరాజును అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా, అతనిపై సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీతో చిత్ర హింసలకు గురి చేశారని రాంమ్మోహన్ నాయుడు లేఖలో వివరించారు.
ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
ప్రభుత్వ పనికిమాలిన చర్యలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్చను అణచివేయాలని చూస్తున్నారని టీడీపీ ఎంపీ రాంమ్మోహన్ నాయుడు స్పీకర్ కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
స్పీకర్ వెంటనే స్పందించి ప్రాథమిక హక్కులను కాలరాసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించాలని, దీనపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని రాంమ్మోహన్ నాయుడు లోక్ సభ స్పీకర్ ను లేఖలో కోరారు.
Must Read ;- ఈ రోజు రాత్రి నా భర్తను చంపేందుకు కుట్ర : రఘురామరాజు భార్య సంచలన కామెంట్స్