వివేకా హత్య కేసుతో సంబంధం లేదని, వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసుకుందాం రమ్మని, లోకేశ్‌బాబు విసిరిన సవాలుకు భయపడే సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రామ్మోహన్ నాయుడు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేశ్ సవాల్ స్వీకరించలేక, కరోనా పేరు చెప్పి జగన్ తప్పించుకున్నాడని ఆరోపించారు. ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని జగన్ చెప్పారు. ప్రజలు కూడా 22మంది ఎంపీలను గెలిపించినా స్టేట్ కోసం పోరాడటం లేదని వ్యాఖ్యనించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఒక్కసారైనా ఢిల్లీ వెళ్లారా అని ప్రశ్నించారు. అదే నారా చంద్రబాబు నాయుడు అయితే, గతంలో ఢీల్లి వెళ్లి మోదీపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. తిరుపతి ప్రజల టీడీపీ వెంటే ఉంటారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Must Read ;- వైసీపీ అరాచక పాలనను అడ్డుకోండి.. ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్











