భారతీయ సినీ సంగీత దిగ్గజం ఏ.ఆర్.రహమాన్ తల్లి.. కరీమా బేగం కన్నుమూశారు. రహమాన్ తన తల్లి ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ వార్త ను కన్ఫర్మ్ చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె చనిపోయిందని చెప్పారు రహమాన్. తన తల్లి కరీమా బేగం అంటే ప్రాణం అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు రహమాన్. నిజానికి తనను సంగీతం వైపుకు మళ్ళించింది ఆవిడే అట. తాను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే తన రూట్ సంగీతమని కరీమా చెప్పిందని రహమాన్ చెప్పారు.
ఎన్నో మలయాళ చిత్రాలకు మ్యూజిక్ కండక్టర్ గానూ, సంగీత దర్శకుడిగానూ పనిచేసిన తన తండ్రి శేఖర్ మరణించినప్పుడు .. చిన్నపిల్లవాడైన తనను సంగీతమే తన జీవనాధారమని రహమాన్ కు ఆవిడ సూచించిందట. సినిమాల్లో చూపించినట్టుగా తమది కౌగిలించుకొనే తల్లీ కొడుకుల బంధం కాదని, పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకొనే స్నేహమని రహ్మాన్ అంటూంటారు. రహమాన్ తల్లి మరణం పట్ల భారతీయ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.