లాక్ డౌన్ అనంతరం తెరుచుకున్న థియేటర్స్ లోకి .. ఒకో సినిమా విడుదలవడం ప్రారంభమైంది. సాయిధరమ్ తేజ సోలో బ్రతుకే సో బెటర్ , రవితేజ క్రాక్ మూవీస్ సూపర్ హిట్ అవడంతో.. దర్శక నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. దాంతో మిగతా సినిమాల మేకర్స్ కూడా తమ తమ సినిమాలకు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ అల్లు అర్జున్, మహేశ్ బాబు లాంటి యంగ్ స్టార్స్ తమ రిలీజ్ డేట్స్ ప్రకటించడంతో.. ఆ తర్వాత వంతుగా మెగాస్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ సైతం తమ సినిమాల్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇక మిగిలింది నట సింహ బాలయ్యే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న యాక్షన్ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది . కానీ.. ఇంతవరకూ ఈ సినిమా విడుదల తేదీ వివరాలేమీ వెల్లడికాలేదు. అందుకే అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్ అదే పనిలో ఉన్నట్టు సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీ గురించి అదిరిపోయే అప్టేడ్ రాబోతోందని తెలుస్తోంది.
గతంలో బాలయ్య , బోయపాటి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూడో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు డిఫరెంట్ కేరక్టర్స్ ను పోషిస్తోన్న బాలయ్య .. ఈ సినిమాతో కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. గతంలో వచ్చిన టీజర్ మినహా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఏదీ ఇంతవరకూ రాలేదు. మరి ఈ సినిమా విడుదలను బాలయ్య, బోయపాటి ఎప్పుడు ప్లాన్ చేశారో చూడాలి.
Must Read ;- ‘క్రాక్’ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ బాలయ్యతోనేేనా?











