స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాస్టియర్ ‘అల వైకుంఠపురములో’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడమే కాకుండా.. ఆ సినిమా పాటలతో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అందుకే ఈ ఏడాది .. అతడి తదుపరి చిత్రం ‘పుష్ప’ మూవీపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా మేకోవర్ అయిన బన్నీ, అతడి స్టన్నింగ్ లుక్.. రగ్డ్ కేరక్టర్, మాస్ కథాంశం, క్రైమ్ బ్యాక్ డ్రాప్ ఈ మూవీకి అదనపు ఆకర్షణలు.
బ్రిలియెంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ లుక్ మాత్రమే ఇంతవరకూ రివీలైంది. ఇంతవరకూ టీజర్ కానీ, తదిదర లుక్స్ కానీ విడుదలవలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఆ సినిమా విడుదల తేదీనే అనౌన్స్ అవడం అభిమానులకు పండగగా అనిపిస్తోంది.
‘పుష్ప’ సినిమా కు విడుదల తేదీ ఖారారు చేస్తూ .. బన్నీ అదిరిపోయే లుక్ తో కూడిన ఒక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్ . ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగస్ట్ 13వ తేదీన పుష్ప విడుదల కాబోతోంది. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోన్న ‘పుష్ప’ మూవీ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో థ్రిల్లింగ్ సన్నివేశాలతో అలరించబోతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో క్రేజీ నటీనటుల అందరూ వైవిధ్యమైన పాత్రలతో అదరగొట్టబోతున్నారు.
థియేటర్స్ కు పర్మిషన్స్ ఇచ్చింది మొదలు.. ఈ ఏడాది నుంచి పెద్ద పెద్ద సినిమాలన్నీ తమ విడుదల తేదీల తో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మెగా హీరోల సినిమాలన్నీ సమ్మర్ ను టార్గెట్ చేయడం మెగాభిమానుల్ని ఖుషీ చేస్తున్నాయి. మరి పుష్ప సినిమా బన్నీకి ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Musr Read ;- ‘పుష్ప’లో ఊహకందని ట్విస్ట్ .. సుక్కూ ప్లాన్ అదుర్స్
#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo
— Allu Arjun (@alluarjun) January 28, 2021