July 11, 2026 5:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

 ‘ఇందిరమ్మ’ నుంచి నిధుల వరకు వైఎస్‌కు తోడుగా నిమ్మగడ్డ!

ప్రస్తుతం ఏపీలో ఎస్ఈసీకి, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నతరుణంలో వైఎస్ గురించి నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా సమీక్షలో వైఎస్ ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, తన  హృదయంలో ఆయనంటే ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు.

January 30, 2021 at 4:07 PM
in Andhra Pradesh, Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ ప్రభుత్వం డైరెక్ట్‌గా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికలకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం సహకరించాల్సి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న జిల్లాల పర్యటనల్లో భాగంగా కడప జిల్లాలోనూ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా  ఆయన ప్రెస్ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తప్ప తనకు ఎవరి ఆశీస్సులూ లేవని వ్యాఖ్యానించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తాను ఆర్థిక శాఖలో ఉన్నానని, తాను చెప్పదలుచుకున్న అభిప్రాయన్ని, నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్చను వైఎస్ ఇచ్చారని అన్నారు. వైఎస్ ఆశీస్సులతోనే తాను రాజ్ భవన్‌కు వెళ్లానని వ్యాఖ్యానించారు. అదే సమయంలో సీబీఐ కేసుల విషయంలో తాను సాక్షిగా ఉన్నానని, ఏనాడూ తాను ఇబ్బంది పడలేదని వ్యాఖ్యానించారు.

 

వైఎస్‌తో ఐదేళ్ల పాటు పని చేసి..

ఇక అప్పట్లో సీఎం వైఎస్‌కి, ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కి ఉన్న అనుబంధం విషయానికి వస్తే.. దాదాపు ఐదేళ్లు ఆయన వైఎస్ వద్ద పనిచేశారని చెప్పవచ్చు. పాదయాత్రలో వైఎస్ ఇచ్చిన హామీల అమలుతో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ పథకం,జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు కేటాయింపునకు సంబంధించి కీలకమైన ఆర్థికశాఖలో ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి వైఎస్ అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కూడా అమలైంది. అప్పట్లో ఉమ్మడి ఏపీలో 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండో విడత కార్యక్రమాన్ని 2007లో అమలు చేశారు. రెండో విడతలో మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక వేశారు. ఇక జలయజ్ఞంలో భాగంగా నెట్టెంపాడు, పులిచింతల, ప్రాణహిత-చేవెళ్ల, శ్రీపాదసాగర్, శ్రీరాంగసార్ ఆయకట్టు స్థిరీకరణ, పోలవరం కుడి, ఎడమ కాల్వల నిర్మాణం, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా లాంటి కార్యక్రమాలు అమలయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకం కూడా ఆసమయంలోనే జరిగింది. ఇందుకు సంబంధించి రూ.వేలకోట్ల నిధులు కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వేతనాల చెల్లింపులు, సంక్షేమ పథకాలకు కేటాయింపులు..ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా రోశయ్య వ్యవహరించారు. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యే నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవసాయ శాఖలో కార్యదర్శి హోదాలో ఉన్నారు. వైఎస్ సీఎం అయ్యాక డిసెంబరు 24న గృహ నిర్మాణ శాఖ పరిధిలో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అదే శాఖలో 2006 మే 19వరకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తరువాత వివిధ పథకాల అమల్లో భాగంగా ఆర్థిక శాఖలో బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. మే 19, 2006– మార్చి16, 2009 వరకు అదే పోస్టులో ఉన్నారు. తరవాత రాజ్‌భవన్ కార్యదర్శి నియామకం కోసం ప్రభుత్వం పంపిన జాబితాలో నిమ్మగడ్డ రమేష్ పేరును కూడా ప్రభుత్వం చేర్చింది. ప్రభుత్వ సిఫారసు మేరకు అప్పటి నుంచి ఏడేళ్లపాటు అదే పోస్టులో పనిచేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.

Must Read ;- కత్తి దూసిన నిమ్మగడ్డ.. వేటు షురూ!

కడప జిల్లాలోనే..

ఇక్కడే మరో విషయం కూడా ఉంది. వైఎస్ హయాంలో కడప జిల్లాతో పాటు పులివెందులకు కూడా చాలా నిధులు కేటాయించారని, పులివెందుకు రూ.వందల కోట్ల నిధులు కేటాయించుకున్నారని, జాతీయ రహదారుల (అప్పటి) స్థాయిలో రోడ్లు వేయించుకున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే, ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో నిధుల కేటాయింపు విషయంలో అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని అప్పట్లో ప్రభుత్వమే పలుమార్లు చెప్పింది. ఈ కేటాయింపుల్లో నిబంధనల అతిక్రమణ జరిగి ఉంటే..ఈ విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేదని అప్పటి నాయకులు చెబుతుంటారు. ఆర్థిక శాఖ ఆమోదం తెలపనిదే.. ప్రాజెక్టులకు, ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యశ్రీ, లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. మొత్తం మీద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపకు రివ్యూకి వెళ్లిన SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఆశీస్సులున్నాయని చెప్పడం, తన  హృదయంలో ఆయనంటే ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

సీబీఐ కేసుల్లో సాక్షిగా..

ఇదే ప్రెస్ మీట్‌లో నిమ్మగడ్డ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పైళ్లపై తాను సంతకాలు చేశానని, సీబీఐ కేసుల విషయంలో సాక్షిగా ఉన్నానని, రానున్న కాలంలో సాక్ష్యం చెప్పాల్సి వస్తే చెబుతానని కూడా వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి భయం లేదని, విట్ నెస్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో భాగంగా తనకు ఉండాల్సిన రక్షణ తనకు ఉందని వ్యాఖ్యానించారు. వ్యవస్థల కార్యకలాపాలు స్వేచ్ఛగా, నిబంధనల ప్రకారం జరిగితే  సమస్యలు రావని, వైఎస్ కూడా ఆ స్వేచ్చ ఇచ్చారని చెప్పారు.

Also Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!

Tags: Andhra pradesh election commissioner nimmagadda ramesh kumarCommissioner Nimmagadda Ramesh KumarEditorspickelection commissioner nimmagadda ramesh kumarnimmagadda interesting coments on ysrnimmagadda ramesh kumarnimmagadda ramesh kumar about ys rajasekhara reddynimmagadda ramesh kumar retirement datetelugu newsy.s rajasekhara reddyys rajasekhara reddyYS Rajasekhara Reddy news
Previous Post

బాలయ్య సినిమా రిలీజ్ డేట్ కూడా రాబోతోందట.. !

Next Post

బాప్ రే.. యాప్ లు.. బతుకు బస్టాండే!

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Lavanya Tripathi

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ చిత్రం షూటింగ్

మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ‘కార్తికేయ 2’

ముంబై లో ఫ్లాట్ కొనేసిన రష్మికా మందన్న

కోటి మొక్కలు నాటిన నేటి అశోకుడు.. వనజీవి రామయ్య!

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

Janhvi Kapoor looking hot in Saree

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist