మేం తెగిస్తే ..వ్యవస్థలను బద్దలుకొట్టి బుద్ధిచెబుతాం!
మీలా మేం మాట్లాడలేం. మాకు సంస్కారం, సంప్రదాయం ఉంది. మా నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సహించం. రాజకీయాలు హుందాగా చేయాలి. అంతేకాని వ్యక్తిగత దూషణలకు దిగితే వ్యవస్థలను బద్దలు కొట్టుకుని మరి వచ్చి, మీ భరతం పట్టి, తగిన బుద్ధి చెబుతాం అని అధికారపార్టీపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. సభలో అధికార పక్షంలో మహిళాల నేతలు కూడా ఉన్నారు .. వారి ముందు ఒక ఆడుబిడ్డను పట్టుకుని వ్యక్తిగతాన్ని హననం చేస్తుంటే ఖండించకపోవడం శోచనీయం. నా చెల్లిలను పట్టుకుని అనరాని మాటలు అంటారా? గొడ్ల చావిడిలోని భాష వాడితే చూస్తు ఊరుకోం.. సమస్యలు, రాజకీయాలు మాట్లాడకుండా నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తే చేతులు కట్టుకుని కూర్చొమని తీవ్ర హెచ్చరికలు చేశారు. నా తండ్రి ఎన్టీఆర్ నుంచి సామాజీక,రాజకీయ,కుటుంబ విలువలను వారసత్వంగా పొందాం. ఇదే నా హెచ్చరిక .. ఇటువంటి నీచ, నికృష్ట రాజకీయాలకు పాల్పిడితే సహించేది లేదని ఆగ్రహించారు. ఇప్పటికైనా మారండి .. లేకుంటే మీ మెడలు వంచి ఎలా మార్చాలో మాకు తెలుసు. అందరికి భార్యలు, పిల్లలు ఉన్నారు.. మేం ఏమీ చేతులు కట్టుకుని కూర్చోం… ఖబడ్దార్ అని హెచ్చరించారు. నోరు జాగ్రత్తలో పెట్టుకుని మాట్లాడండి. చంద్రబాబు అనుమతి కూడా మాకు అవసరం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బాలయ్య.
Must Read ;- నారా కుటుంబానికి అండగా నందమూరి కుటుంబం
https://www.youtube.com/watch?v=gf3BcCwNOJQ











