నందమూరి వారి వారసుడు తారకరత్న తాజాగా ‘సారథి’ అనే మూవీతో రాబోతున్నాడు. ఖోఖో నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి జాకట రమేశ్ దర్శకుడు. ఇందులో తారకరత్న ఖోఖో కోచ్ గా నటిస్తుండడం విశేషం. వెనుకబడిన గ్రామీణ క్రీడల్ని వెలుగులోకి తీసుకురావాలని తపించే ఓ పెక్యులర్ కేరక్టర్ ను ఇందులో తారకరత్న పోషిస్తున్నాడు.
దసరా సందర్భంగా ‘సారధి’ సినిమాకి సంబంధించిన టైటిల్ లుక్ ను రివీల్ చేసిన మేకర్స్.. ఈ రోజు తారకరత్న లుక్ ను విడుదల చేశారు. ప్లకార్డు పట్టుకొని ఒక మైదానంలో కూర్చున్న లుక్ లో తారకరత్న చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. పంచభూతా క్రియేషన్స్ బ్యానర్ పై పి.నరేష్ యాదవ్, వై.యస్. కృష్ణ మూర్తి, పి.సిద్ధేశ్వరరావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి సారథి గా తారకరత్న ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.











