తాడేపల్లి పరిధిలోని సీతానగరం దగ్గర ప్రియుడ్ని కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడి గట్టడంతో సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. జనం తిరగబడతారనే భయంతోనే రెండేళ్లుగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసోలేషన్ ఉన్నారని ఆరోపించారు. ‘‘ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా.. జగన్‘‘ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఏ చిన్న ఆరోపణ వచ్చినా టీడీపీ నాయకులపై కేసులు పెట్టే పోలీసులు.. సీఎం జగన్ కార్యాలయం దగ్గర ఓ యువతికి ఘోర అన్యాయం జరిగితే ఏమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేయలేనోడు.. ఆంధ్రప్రదేశ్ లోని ఆడపిల్లలకు ఏం న్యాయం చేస్తాడని తనదైన శైలిలో సెటైర్ వేశారు. అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని జగన్ కాపలా పెట్టుకున్నాడని, ఆయన పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్ధకమైందని లోకేష్ ట్వీట్ చేశారు.
జగన్ గారు.. మీకు వినబడుతుందా?
సీతానగరం పుష్కరఘాట్లు అసాంఘిక కార్యకాలపాలకు అడ్డాగా మారాయి. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. మందబాబులు, బ్లేడ్ బ్యాచ్ లు ప్రతిరోజు తిష్ట వేసి ఒంటరిగా వెళ్లే వ్యక్తులు, మహిళలపై దాడి చేస్తున్నారు. వారి నుంచి ఫోన్లు, విలువైన బంగారు నగలు, డబ్బును దోచుకెళ్తున్నారు. గతంలోనూ ఓ మహిళా గార్డుపై దాడి చేసి నగదు దోచుకెళ్లారు. సాక్షాత్తూ సీఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇలాంటి కార్యాకాలపాలు జరుగుతున్నా.. పోలీసులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీలో ఎన్నో అమానవీయ సంఘటనలు జరుగుతున్నా.. సీఎం జగన్ మాత్రం అధికారిక నివాసానికే పరిమితమవుతున్నారనే ఆరోపణలు అంతటా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో… నేను విన్నాను.. నేను ఉన్నాను… ప్రచారం చేసుకున్న జగన్ కు ఇలాంటి ఘోర ఘటనలు కనిపించడం లేదా అని పలు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Must Read ;- నారా లోకేశ్ పైనా కేసు పెట్టేశారబ్బా!
రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు? సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారు. (2/3) pic.twitter.com/gF5lDQi38B
— Lokesh Nara (@naralokesh) June 21, 2021