బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఆషికి’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె చేసిన ‘ఏక్ విలన్’, ‘ఏబిసిడి – 2’, ‘భాగీ’ వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేసిపోయింది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో‘ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది శ్రద్దా కపూర్. ఈ చిన్నది సినిమాల ద్వారానే కాకుండా తాను ధరించే ఫ్యాషన్ వేర్ ద్వారా కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పేరు కు తగ్గట్టు తన దుస్తుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తుంది. ఈమధ్యన ఆమె ఒక ప్రమోషనల్ ఈవెంట్ కు హాజరయ్యింది. ఈవెంట్ లో ఆమె సరికొత్త దుస్తులతో చాలా హాట్ గా కనిపించింది.

ఈ కార్యక్రమంలో శ్రద్దా ఇంత అందంగా కనిపించడానికి ముఖ్య కారణం ప్రముఖ డిజైనర్ నమ్రతా. ఆమె ప్రత్యేకంగా శ్రద్దా వేసుకున్న దుస్తులను డిజైన్ చేశారు. ప్రమోషనల్ ఈవెంట్ కోసం శ్రద్దా నలుపు, నీలం కలగలిసిన దుస్తులను ఎంచుకున్నారు. స్వీట్ హార్ట్ షేప్ లో ఉన్న నలుపు రంగు టాప్ వేసుకున్నారు. అలాగే నడుము నుండి కింద కాళ్ల వరకు ఆమె శరీరానికి బాగా పట్టి ఉండేలా నీలి రంగు స్కర్ట్ ధరించింది.

అలాగే నీలి రంగు స్కర్ట్ పై ప్రకాశవంతమైన ఆకుపచ్చ, పసుపు రంగులతో బొటానికల్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంది. అంతేకాకుండా చేతులకు సున్నితమైన నెట్ తో తయారు చేసిన స్లీవ్స్ కూడా ఉన్నాయి. ఇక చెవులకు వెండి మరియు నీలమణి రంగు చెవిపోగులు, కాళ్ళకి నలుపు రంగు హీల్స్, కళ్ళకి ఐలైనర్, పెదాలకు లైట్ బ్రౌన్ కలర్, అలాగే జుట్టును గాలికి వదిలేసి అందంగా కనిపించింది శ్రద్దా. కార్యక్రమానికి వచ్చిన వారు కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉంది శ్రద్దా. ఆమె ఫోటోలు చూసిన అభిమానులు ముగ్దులు అవుతున్నారు.
Must Read ;- నీరెండలో తేనేటిని సేవిస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్











