ఒక్క ట్వీట్ చేస్తే చాలు..సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. లీడర్ అంటే ఎలా ఉండాలో స్వయంగా చూపిస్తున్నారు. కొందరు వైద్యం కోసం, మరికొందరు ఆర్థిక పరిస్థితి సరిగా లేనివారు, ఇంకొదరు నీళ్ల సమస్యలు, అలాగే రోడ్ల సరిగా లేవంటూ వారి, వారి సమస్యల్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని వెల్వడం అనే ఊరి సమస్యను ఓ యువకుడు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు..ఈ విషయం తెలిసిన వెంటనే నారా లోకేష్ ట్వీట్ చేసిన వ్యక్తికి క్షమాపణలు చెప్పారు..దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని వెల్వడంలో ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు సోమవారం ప్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు. నాలుగు నెలల క్రితం తారు రోడ్డును తొలగించి గ్రావెల్ పోసి వదిలేశారని స్థానికులు ఆరోపించారు. ఈ సమస్య వల్ల విద్యార్థులు కూలీలు ప్రయాణికులు వాహనదారులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి లోకేష్ ఈ సమస్య పరిష్కరించాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారంటూ సదరు యువకుడు ట్వీట్ చేశారు.
స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో..లోకేష్ అన్న మా ఊరి సమస్యని పరిష్కరించండి.. ప్రస్తుతం గ్రామంలో రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. 10 ఏళ్ల క్రితం వెల్వడం గ్రామంలో కొన్ని సర్వే నంబర్లు మాత్రమే నోటిఫై చేసి రోడ్డు నిర్మాణం చేయడం వల్ల ఇరుకు, ట్రాఫిక్ రోడ్డుతో సంవత్సరాలుగా అధికారులు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మళ్లీ 4 నెలల క్రితం తారు రోడ్డు తొలగించి..గ్రావెల్ పోసి రోడ్డు పనిని పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో స్కూల్ విద్యార్థులు, కూలీలు, ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. నోటిఫై చేయని సర్వే నంబర్లు నోటిఫై చేసి గుంతలమయంగా మారిన రోడ్డును నిర్మాణం చేసి వెల్వడం గ్రామ సమస్యను, ప్రయాణికుల సమస్యను త్వరగా పరిష్కరించగలరని ప్రార్థిస్తున్నామన్నారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేష్..రోడ్డు బాగాలేకపోవడం వల్ల వెల్వడం గ్రామ ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాను. నాలుగు నెలల క్రితం తారు రోడ్డును తొలగించారు.. దాని స్థానంలో కంకర రోడ్డు వేశారు. దీని వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం నాకు తెలుసు. స్థానిక MLA వసంత కృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడతాను. అధికారులతో కూడా మాట్లాడి వీలైనంత త్వరగా రోడ్డును త్వరగా బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు..
లోకేష్ ట్వీట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫస్ట్ టైం దేశ రాజకీయాల్లో సమస్యలు చెబితే హుందాగా క్షమాపణలు చెప్పడం లోకేష్ రాజకీయ పరిణతికి నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తంగా లోకేష్ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు.










