September 29, 2023 8:38 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లోకేష్ వేసే ప్రతి అడుగు ప్రజా ఫీడన విముక్తికి అంకుశం

April 21, 2023 at 11:28 AM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర తెలుగుదేశానికి వెలుగు కిరణం.కాలంలోనూ,దూరంలోనూ అపూర్వ రీతిలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చరిత్ర లోకేష్ ది. పార్టీ బలోపేతానికి తనకర్తవ్యాన్ని తన భుజస్కoదాల మీద వేసుకొని తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొంటున్నారు.పాదయాత్రకు జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా,ఎన్ని కేసులు పెట్టినా లోకేష్ అదరలేదు,బెదరలేదు.కార్యసాధకుడికి కష్టం ఒక అవకాశం.లోకేష్ వేస్తున్న ప్రతి అడుగు ప్రజాఫీడన విముక్తికి అంకుశం కాగలదు. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అన్ని వర్గాల నుండి అపూర్వ ఆదరణ లభిస్తుంది.తనను కలిసేందుకు వస్తున్న ప్రజలకు అత్యంత సన్నిహితంగా కలిసి నడవడం,ఆప్యాయంగా పలకరించడం,వారి సమస్యలు వినడం అధికారంలోకి రాగానే పరిష్కారం చేస్తామంటూ భరోసా ఇస్తున్నారు. అట్లాగే ఏది మంచి,ఏది చెడు అనే అంశాలను ప్రజలకు వివరించి వారిని ఆలోచింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ అనేక విషయాల పై అవగాహనతో మాట్లాడుతున్నారు.జనం మధ్య ఆత్మీయంగా మెలుగుతూ తనను తాను ప్రజానాయకుడిగా నిరూపించుకోన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్దతను,అవినీతిని కడిగి పారేస్తున్నారు. కొత్తగా రాజకేయాల్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు ఎవరికైనా తడబాటు సహజం.కానీ నేడు లోకేష్ ఒక పరిపక్వత కలిగి, కష్టాన్ని ఓర్చుకో గలిగిన శక్తీ వంతమైన నాయకుడిగా, తనను తాను కార్యసాధకుడిగా నిరూపించుకొన్నారు పాదయాత్ర ద్వారా. లోకేష్ ను వైసిపి నాయకులు అనేకమైన వెక్కిరింతలతో హేళన చేశారు. పప్పు వంటి పదాలతో గేలి చేశారు.ఆయన వ్యక్తిత్వాన్ని,సమర్ధతని దెబ్బతీయ్యడానికి సామాజిక మాధ్యమాలలోనూ సకల ప్రయత్నాలు చేశారు.నేడు లోకేష్ అనేక అంశాలపై అవగాహనతో ఆచరణాత్మకంగా మాట్లాతుండటంతో నాడు విమర్శించిన వారంతా నేడు లోకేష్ సమర్దతను,పరిపక్వతను చూసి నోరెళ్ళ బెడుతున్నారు. జనంతో సంబంధం పెట్టుకోవడం ద్వారా రాజకీయ, సామాజిక లక్ష్యాలు నిర్ధేశించుకొని చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారెవరూ రాజకీయాల్లో విఫలం కాలేదు.జనంతో అత్యంత సన్నిహితంగా మెలిగే పాదయాత్ర లోకేష్ చెపట్టడంతో ఇప్పటికే ప్రతిష్ఠ దిగజారిన అధికారపక్షానికి తమకున్న జనామోదం మరింత క్షీణిస్తుందన్న కలవరం మొదలు అయింది. లోకేష్ పాదయాత్ర అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.రానున్న సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయానికి లోకేష్ ప్రభంజనం మరింత పెరిగితే తమ పరిస్థితి ఏమిటని వైసిపి నాయకుల గుండెల్లో గుబులు మొదలయింది.

పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు,పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపెందుకు యువగళం పాదయాత్ర ఎంతో దోహదం చేస్తుంది. పాదయాత్రకు పల్లెలు కదులు తున్నాయి. పట్టణాలు తరలుతున్నాయి. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలు,అవినీతి,అసమర్ధత, వ్యవ సాయ సంక్షోభం,రైతు ఆత్మహత్యలు,పెంచిన విద్యుత్తు చార్జీలు,పడకేసిన పారిశ్రామిక రంగం,పెరిగిన నిత్యావసర ధరలు,రాష్ట్రంలో ఏ విధంగా ప్రజా సంపద దోపిడీ చేస్తున్న విధానాన్ని ప్రజల కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు లోకేష్ . తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనను ,వైసిపి పరిపాలన కంపేరు చేస్తూ ప్రజలను ఆలోచించమని ప్రజలను కోరుతున్నారు.నాలుగేళ్లుగా ప్రజల భాధలు వర్ణనాతీతం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు అదుపులేదు. పన్నులు భారంతో పేదలు సామాన్యులు,మధ్యతరగతి వారు బతక లేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పాదయాత్రలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,కూలీలు,కమ్మరి,కుమ్మ రి ,కంసాలి వంటి చేతి వృత్తులు వారిని బీసీలను,రైతులను,మహిళలను ,విద్యార్థులు,నిరుద్యోగులు,వీరందరి సమస్యల పరిష్కారానికి,స్వావలంభనకు వివిధ వర్గాల అభ్యున్నతి కోసం,రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. పాదయాత్ర ద్వారా ఆయన జనంలోకి వెళ్లడంతో వైసిపి నాయకులు వణికి పోతున్నారంటే,తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత సానుకూల పరిస్థితి ఉన్నదో అర్ధం అవుతున్నది.దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం నాయకులు అందరి పై వుంది. తెలుగుదేశం పార్టీ నిరంతరాయంగా కొనసాగుతుందన్నభరోసాగా యువగళం పాదయాత్ర అనేక ప్రతికూల అంశాలకు విరుగుడుగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు. పాదయాత్రలో ప్రభుత్వానికి లోకేష్ విసురుతున్న సవాళ్లకు,సెల్ఫీ ఛాలెంజ్ లకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి,సంక్షేమం పై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ విసిరిన సవాల్ ను ప్రభుత్వం సవీకరించలేకపోయింది . అంతేకాదు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశ్రమలు వద్ద లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లకు కూడా ప్రభుత్వం నుండి సమాధానం లేదు.

యువగళం పాదయాత్ర సాగనీకుండా అధికార పార్టీ వైసిపి అడుగడుగునా అడ్డంకులు కల్పించినా, ఒక సెక్షన్ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అడుగడుగనా అడ్డుకోవాలని చూసినా, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బిసి, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ప్రజలంతా సంఘటితమై యువగళం పాదయాత్రకు రక్షణ గానిలిచి ముందుకు నడిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర రోజు,రోజుకు జన సముద్రంగా మారుతుంది . జనవరి 27 న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన యువగళం పాద యాత్ర 74 రోజులు అవుతుంది.1000 కిలోమీటర్లు పూర్తీ కావస్తుంది. పాదయాత్రలోయువత మొదటి నుంచి కదం తొక్కుతోంది. యువతకే ఈ యాత్ర పరిమితం కాకుండా, రైతులు, మహిళలు, కార్మికులు, బిసి, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అన్నివర్గాల ప్రజానీకం ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. ఉదయాన్నే యాత్ర ఆరంభంలో అందరితో సెల్ఫీలు ఒక ఉత్ప్రేరకమైతే, యువగళంలో లోకేశ్ తో గొంతు కలిపేందుకు, ఆయన అడుగుల్లో అడుగేసేందుకు ఆయా వర్గాల ఉత్సాహం ప్రత్యక్షంగా చూడాల్సిందే తప్ప వర్ణించ జాలము. కాళ్లకు బొబ్బలెక్కినా ,మండు టెండలోను లోకేశ్ స్పీడ్ అందుకునేందుకు టిడిపి నాయకులు, కార్యకర్తలు పరుగులు తీయాల్సిన పరిస్థితి. కేసులు పెట్టినా, సభలు జరగకుండా అడ్డుకున్నా, చివరికి ఎత్తు స్టూల్ కూడా లాక్కుని, ప్రజలను కలవనీయకుండా, వారిని పలకరించనీయ కుండా, ప్రసంగించనీయ కుండా అడ్డుకున్నా మొక్కవోని ధైర్యంతో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నారా లోకేశ్ యువగళం యాత్రను ముందుకు నడిపిస్తున్నారు.అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతపట్టుకుని, పాదయాత్ర తన హక్కంటూ, సమావేశమయ్యే హక్కు బాబాసాహెబ్ తనకిచ్చారని చెబుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను అనర్గళంగా వల్లెవేస్తూ ముందుకు దూసుకుపోతున్న లోకేశ్ ను చూసి అడ్డుకోవాలని చూసినవాళ్లే ముక్కున వేలేసుకుని విస్తుపోయేలా చేస్తోంది.

పాదయాత్రలో ప్రతిరోజూ ఎక్కడికక్కడ రైతులతో భేటీలు, వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకోవడం, పరిష్కారాల అన్వేషణ, మేనిఫెస్టోలో వాటినెలా పొందు పర్చాలో సూచనలు చేస్తూ రైతాంగంలో భరోసా పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు లోకేష్. చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వడ్డెరలు, బీసీ వర్గాలన్నింటితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ చేతివృత్తులన్నింటినీ ప్రస్తుత వైసిపి ప్రభుత్వమెలా నిర్వీర్యం చేసిందో తెలియజేస్తూ, గతంలో టిడిపి తెచ్చిన స్కీములు ఎలా రద్దు చేశారో వివరిస్తూ, మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తే వారికి చేసే మేళ్లని వివరిస్తున్నారు. బీసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామంటూ భవిష్యత్ పై విశ్వాసం పెంచడం విశేషం. ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలపై వైసిపి దమన కాండ పై ధ్వజమెత్తుతున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అన్యాక్రాంతమైన భూములన్నీ తిరిగి ఇప్పిస్తామని, నిందితులపై కఠిన చర్యలు చేపడతామని, అక్రమ కేసులు ఎత్తేస్తామని హామీలిస్తూ వారిలో నమ్మకం కలిగిస్తున్నారు. అసైన్డ్ భూములు, ఆర్మీ భూములు, దేవాదాయ భూములన్నింటినీ విడిపిస్తామని, విలువై ప్రభుత్వభూములను కాపాడతామని , ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ముందుకెళ్తున్నారు. వైసిపి శాండ్-ల్యాండ్ మాఫియా, వైన్-మైన్ మాఫియా భరతం పడతామని లోకేశ్ హెచ్చరికలు అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. రాష్ట్రాన్నిగంజాయాంధ్రప్రదేశ్ గా మార్చారని, తిరుమల తిరుపతిలో కూడా గంజాయి సరఫరా,విక్రయాలపై ప్రజలకు వివరిస్తున్నారు.నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో వైసిపి ప్రభుత్వ చెలగాటమారుతుందని. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడే వైసిపి గుండాల అంతు చూస్తాననే వార్నింగులతో ఆడబిడ్డలకు అభయం ఇస్తున్నారు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు అయితే, విధ్వంసానికి బ్రాండ్ జగన్ రెడ్డని, లోకేశ్ చేస్తున్న ప్రసంగాలు అన్నివర్గాల ప్రజలను ఆలోచింప చేసేవిగా వున్నాయి .నారా లోకేష్ ఏ గ్రామం,ఏ మండలంవెళ్లినా, ఏ పట్టణం వెళ్లినా ఏ కూడలిలో ప్రసంగిస్తున్నాజనంలో నూతనోత్సాహం ఉరకలు వేస్తుంది.లోకేష్ యువగళం ప్రజల్లోతమ భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతోంది. 400 రోజులు, 4వేల కిమీ యాత్ర లక్ష్యానికి చేరువయ్యేందుకు రాకెట్ స్పీడ్ తో యువగళం సవాళ్ల మధ్య సవారీ చేస్తుంది .ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయనే విశ్వాసం యువగళం పాదయాత్ర కల్పిస్తుంది.తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేoదుకు మండుటెండలో కాళ్ళు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా పాదయాత్ర చేసి లోకేష్ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. లోకేష్ వేసే ప్రతి అడుగు ప్రజాఫీడన విముక్తికి అంకుశం కాగలదు.

Tags: #topstoriesap elections 2024ap newschandrababueditor's pickEditorspickLatest Newsnara lokeshnara lokesh padayatratdptdp vs ysrptop storiesys jaganysrcpyuvagalam padayatra
Previous Post

స్వర్ణాంధ్రా స్వాఫ్నికుడు-నిర్విరామ శ్రామికుడు

Next Post

నిర్బంధాల నడుమ లోకేశ్ యువగళం పాదయాత్ర 1000కిమీ పూర్తి..

Related Posts

బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!

by లియో డెస్క్
September 29, 2023 4:19 pm

 కాకరేపుతున్న అక్రమ కేసులు..! తెలుగు దేశంపార్టీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్...

నారా బ్రాహ్మిణి సంచలన వ్యాఖ్యలు..!

by లియో డెస్క్
September 29, 2023 3:09 pm

మార్క్ రాజకీయాలతో సంచలనాలు..! నారా బ్రాహ్మిణి తన రాజకీయాలు వ్యూహాలను పదును పెడుతున్నారు....

ధర్మాన నెత్తిన పిడుగు

by లియో డెస్క్
September 28, 2023 6:17 pm

రాజకీయాలలో ఎంతో సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావు పరిస్థితి ఏమిటి? ఆయనకేం బాగానే...

పాపం బాలినేని

by లియో డెస్క్
September 28, 2023 1:49 pm

వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రంకెలు వేయడం తప్ప జిల్లాల్లో...

నిస్సహాయంగా…. వ్యవస్థలు

by లియో డెస్క్
September 28, 2023 1:35 pm

ఒక వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు పెట్టింది. దానిపై సంబంధం...

‘దేశం’ ను ఏమార్చి దొంగఓట్లు

by కృష్
September 27, 2023 3:33 pm

చంద్రబాబునాయుడు అరెస్టు తో తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల వరకూ సంబంధిత...

అధినేతల పోటీ ఇక్కడ నుంచే..!

by కృష్
September 27, 2023 3:07 pm

తెలుగుదేశం, జనసేన పొత్తుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు పార్టీల కార్యకర్తల్లో ఉత్సాహం...

ఎంకి పెళ్ళి..సుబ్బి చావు..!

by లియో డెస్క్
September 16, 2023 6:39 pm

చంద్రబాబు అరెస్టు..! ఆంధ్రా..తెలంగాణా..కర్నాటక..తమిళనాడు బరస్డు..! ఐటీ ఉద్యోగుల నిరసన..మగువల తెగువ..! యన్ ఆర్...

బాబు అరెస్టుపై భగ్గుమంటున్న మాజీలు- మౌనం వీడుతున్న మేధావులు

by లియో డెస్క్
September 16, 2023 4:39 pm

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి వారం రోజులుగా...

‘ఖుషి’ 100 లక్కీ ఫ్యామిలీస్ లిస్ట్

by లియో డెస్క్
September 14, 2023 3:32 pm

"ఖుషి" సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకోవాలని ఉందని,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

‘దేశం’ ను ఏమార్చి దొంగఓట్లు

ధర్మాన నెత్తిన పిడుగు

అధినేతల పోటీ ఇక్కడ నుంచే..!

బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

టాలీవుడ్ లో స్పెషల్ రోల్స్ చేస్తోన్న పూర్ణ

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

పాపం బాలినేని

ముఖ్య కథనాలు

బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!

నారా బ్రాహ్మిణి సంచలన వ్యాఖ్యలు..!

ధర్మాన నెత్తిన పిడుగు

పాపం బాలినేని

నిస్సహాయంగా…. వ్యవస్థలు

తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే: ముత్తయ్య మురళీధరన్

బాబుకు మద్దతుగా మోడీకి కె.ఎస్. రామారావు లేఖాస్త్రం

ఎంకి పెళ్ళి..సుబ్బి చావు..!

బాబు అరెస్టుపై భగ్గుమంటున్న మాజీలు- మౌనం వీడుతున్న మేధావులు

న్యూయార్క్ టైం స్క్వేర్ బిల్ బోర్డ్స్ లో స్పూర్తి జితేందర్ విజువల్స్ ప్రదర్శన. ఇంగ్లీష్ సాంగ్ తో చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.

సంపాదకుని ఎంపిక

చిరంజీవికి కౌంటర్‌పై వైసీపీ నేతల టెన్షన్‌ టెన్షన్‌…!!

వైసీపీపై విరుచుకుపడ్డ ఇద్దరు సూపర్‌ స్టార్‌లు..!!

బాబు ప్రశ్నలకు పారిపోయిన జగన్‌ సర్కార్‌??

రాజమండ్రిలో రాజకీయ రణరంగం.. ఒకేరోజు ఇటు చంద్రబాబు అటు జగన్!!

చంద్రబాబు, లోకేష్‌ భద్రతకి ముప్పు?

నాలుగేళ్లుగా సాక్షికి భారీ లాభాలు??

సీమలో వైసీపీ వాష్ ఔట్… సైకిల్ టాప్ గేర్..!!

అంబటి పై జగన్ సీరియస్..??

చిదిరిన గూడు.. అమరావతి గోడు!

పోలవరం పై జగన్ ఫెయిల్.. కడిగి పారేసిన కేంద్ర మంత్రి!!

రాజకీయం

బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!

నారా బ్రాహ్మిణి సంచలన వ్యాఖ్యలు..!

ధర్మాన నెత్తిన పిడుగు

పాపం బాలినేని

నిస్సహాయంగా…. వ్యవస్థలు

‘దేశం’ ను ఏమార్చి దొంగఓట్లు

అధినేతల పోటీ ఇక్కడ నుంచే..!

ఎంకి పెళ్ళి..సుబ్బి చావు..!

బాబు అరెస్టుపై భగ్గుమంటున్న మాజీలు- మౌనం వీడుతున్న మేధావులు

ప్రకృతి యజ్ఞం మొదలుపెట్టింది ధైర్యంగా ఉండండి..

సినిమా

తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే: ముత్తయ్య మురళీధరన్

బాబుకు మద్దతుగా మోడీకి కె.ఎస్. రామారావు లేఖాస్త్రం

‘ఖుషి’ 100 లక్కీ ఫ్యామిలీస్ లిస్ట్

సీనియర్ ఫొటో జర్నలిస్టు కుమార్ స్వామి కుటుంబ సభ్యులను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పరామర్శ

చంద్రబాబు అరెస్ట్ ను సినీ పరిశ్రమ పెద్దలు ఖండించకపోవడం దారుణం

మాస్ జాతర కోసం నాగార్జున నా సామి రంగ

డైరెక్టర్ గా దళపతి విజయ్ వారసుడు

తన రికార్డును తనే బ్రేక్ చేయనున్న తలైవా

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

సోనూ సూద్ చేయూతతో పైలట్ ఉద్యోగం

‘ఖుషి’కి సెన్సార్ పాజిటివ్ టాక్

జనరల్

న్యూయార్క్ టైం స్క్వేర్ బిల్ బోర్డ్స్ లో స్పూర్తి జితేందర్ విజువల్స్ ప్రదర్శన. ఇంగ్లీష్ సాంగ్ తో చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.

ఇంత మోసమా..? రెడ్ల వెన్నవిరిచావ్..!

చిరంజీవికి కౌంటర్‌పై వైసీపీ నేతల టెన్షన్‌ టెన్షన్‌…!!

పోలవరంపై వైసీపీ అట్టర్‌ ఫ్లాప్‌ షో…. బాబుని చూసి వాతలు పెట్టుకున్న అంబటి..!!

వైసీపీపై విరుచుకుపడ్డ ఇద్దరు సూపర్‌ స్టార్‌లు..!!

పోలవరంపై జగన్‌ హ్యాండ్సప్‌…??

రిషాంత్ రెడ్డి బండారం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!

రాజమండ్రిలో రాజకీయ రణరంగం.. ఒకేరోజు ఇటు చంద్రబాబు అటు జగన్!!

చంద్రబాబు, లోకేష్‌ భద్రతకి ముప్పు?

నాలుగేళ్లుగా సాక్షికి భారీ లాభాలు??

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist