నేచురల్ స్టార్ నానీ, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న క్రైమ్ అండ్ పీరియాడికల్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కథాంశం చాలా వెరైటీ గా ఉంటుందట. ప్రీ ఇండిపెండెన్స్ డే టైమ్ లో రాయ్ అనే బెంగాలీ యువకుడు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య సంగ్రామం చేస్తాడు. ఆ క్రమంలో అతడు చనిపోతాడు. అతడే మళ్లీ చాన్నాళ్ళ తర్వాత హైద్రాబాద్ లో శ్యామ్ పేరుతో పుడతాడట. స్ర్కీన్ ప్లే బేస్డ్ గా సాగే ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందట. మొన్నామధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా టీజర్ కు కూడా సమయం ఆసన్నమైంది.
తాజా సమాచారం ప్రకారం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా టీజర్ ను ఉగాది కానుకగా.. అంటే ఏప్రిల్ నెలలో విడుదల చేస్తారట. అప్పుడే సినిమా విడుదల తేదీని కూడా రివీల్ చేస్తారట. నానీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాను వర్గీస్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమా మడోనా సెబాస్టియన్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా.. అశ్వథ్దామ, భీష్మ లో విలన్ గా నటించిన బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా .. ఇందులోనూ విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా నానీ కి ఏ రేంజ్ ఇమేజ్ తెస్తుందో చూడాలి.
Must Read ;- టీజర్ టాక్ : టక్ చేసుకొని తాటతీసే టక్ జగదీష్











