‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హిట్ కొట్టి.. ఇటీవల ‘జాతిరత్నాలు’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. దర్శక, నిర్మాతల కళ్ళన్నీ అతడి మీదే. ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా సక్సెస్ ను తనివితీరా ఆస్వాదిస్తున్న నవీన్.. తదుపరి గా ఓ బిగ్గెస్ట్ మూవీకి కథానాయకుడు కాబోతున్నాడు. మరి అందులో హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంకెవరు అందాల అనుష్కా శెట్టి.
‘నిశ్శబ్దం’ మూవీ తర్వాత నిజంగానే నిశ్శబ్దమై పోయిన అనుష్క శెట్టి.. ఇప్పుడు పెద్ద హీరోతో నటించకుండా.. నవీన్ పోలిశెట్టి లాంటి అప్ కమింగ్ హీరో సరసన నటించడం టాలీవుడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి తన కన్నా 20 ఏళ్ళ పెద్దదైన స్త్రీతో ప్రేమలో పడతాడట. ఈ సినిమాకి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. బహుశా అదే టైటిల్ ను ఖాయం చేయబోతున్నారని తెలుస్తోంది.
‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేశ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా లో నవీన్ పోలిశెట్టి పాత్ర చాలా హిలేరియస్ గా ఉండబోతోందని అంటున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. దాని కన్నా ముందు.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వస్తుందట. ఈ సినిమా కానీ.. హిట్టయితే.. నవీన్ .. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సరసన నటించేస్తాడేమో చూడాలి.
Also Read:అనుష్క వంటి అందమైన భార్య ఉండగా కుంగుబాటేల?











