నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల ప్రేమాయణం .. సౌత్ ఇండస్ట్రీలో బహిరంగ రహస్యమే. శింబు, ప్రభుదేవాల్ని మించి.. ప్రేమను విఘ్నేష్ పట్ల నయన్ చూపిస్తుండడం అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ‘నానుమ్ రౌడీ దాన్’ సెట్లో ప్రేమలో పడ్డ వీరిద్దరూ .. ఐదేళ్ళుగా డేటింగ్ లో ఉన్నారు. అయితే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ దాచడానికి ప్రయత్నించలేదు. నలుగురికీ తెలిసే రేంజ్ లోనే తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు. రొమాంటిక్ ఫోటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకూ ఈ కపుల్ తమ పెళ్ళి విషయం పై నోరు విప్పలేదు.
అయితే ఇప్పుడు విఘ్నేష్ పోస్ట్ చేసిన ఓ ఫోటోతో.. నయన్ తో అతడి ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందనే వార్తలు ఊపందుకున్నాయి. నయన్ ను కౌగిలించుకొని ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసిన విఘ్నేష్ శివన్ .. ఓ తమిళ కొటేషన్ ను ఉంచి.. ఇద్దరి ముఖాలు కనిపించకుండా.. కేవలం నయన్ చేతికి ఉన్న ఉంగరం కనిపించేలా పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ అయిందని నలుగురికీ తెలిసేలా ఆ ఫోటోను విఘ్నేష్ షేర్ చేశాడని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Must Read ;- నయన్ విఘ్నేష్ పెళ్లి ఎప్పుడో తెలుసా?