ఇండియన్ మైకెల్ జాక్సెన్ అనగానే టక్కున మనకు గుర్తుకు వచ్చే పేరు ప్రభుదేవా. డాన్స్ మాస్టర్ గా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన ప్రభుదేవా అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డాన్స్ మాస్టర్ గా సౌత్ ఇండియాలోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచుకున్నాడు ప్రభు మాస్టర్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమా ద్వారా హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ప్రభు మాస్టర్ ఆ తర్వాత అనేక సినిమాల ద్వారా తెలుగు, తమిళ్ ప్రేక్షకులను మెప్పించాడు.
అక్కడితో ఆగకుండా టాలీవుడ్, బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం కూడా వహించి ఔరా అనిపించాడు. మరోసారి ప్రభుదేవా తనలోని నటుడిని మనకు పరిచయం చేయబోతున్నాడు. అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘బఘీరా’ అనే సినిమాలో మొదటిసారి ప్రభుదేవా నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన ఒక సీరియల్ కిల్లర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. . ఇందులో ప్రభుదేవా నటన మరో స్థాయిలో ఉంటుందని రవిచంద్రన్ తెలిపాడు. జంగిల్ బుక్ లోని బఘీరా పాత్ర స్పూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నానని ఇప్పటికే దర్శకుడు స్పష్టం చేశాడు.
ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రస్తుతం ‘బఘీరా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. సైకో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారతన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గణేశన్ శేఖర్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ప్రభుదేవా మొదటిసారి నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ పాత్రతో ప్రభు మాస్టర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
Must Read ;- ప్రేమలో పడిన బాలీవుడ్ స్టార్ డాటర్.. !










