తమిళ్ క్రేజీ దర్శకుడు బాలా.. హీరో విశాల్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో హీరో ఆర్య కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. విశాల్ పై ఒక పాటను కూడా తెరకెక్కించాడు దర్శకుడు బాలా. ఇంకా ఆర్య మాత్రం షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎటువంటి టైటిల్ ను ఫైనల్ చేయలేదు. అనేక పేర్లను పరిశీలించిన దర్శకుడు ‘ఎనిమీ’ అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.
సినిమా కథకు ‘ఎనిమీ’ టైటిల్ కరెక్ట్ గా సరిపోతుందని భావించిన దర్శకుడు చివరికి ఈ పేరునే ఫైనల్ చేసాడని టాక్ నడుస్తోంది. టైటిల్ ను ఈరోజు అనగా నవంబర్ 25వ తేదీన రివీల్ చేయబోతుంది చిత్ర బృందం. వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో బాల దర్శకత్వంలో విశాల్ – ఆర్య కలిసి ‘అవన్ ఇవన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో ‘వాడు – వీడు’ టైటిల్ తో రిలీజ్ అయింది. ఆ సినిమా తమిళ్ తో పాటుగా తెలుగులోనూ బాగానే ఆడింది. ఈ సినిమాతో దర్శకుడు బాలాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
అందుకనే బాలా – విశాల్ – ఆర్య కలయికలో వస్తున్న రెండో చిత్రంపై కూడా కోలీవుడ్ లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అసలే వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే బాలా ఈ చిత్రాన్ని ఎలా తీస్తాడో అని అందరికీ ఆసక్తిగా ఉంది. ఈ సినిమాను తమిళ్ తో పటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. అప్పుడు ‘వాడు వీడు’ గా ప్రాణ స్నేహితులుగా నటించిన ఆర్య విశాల్ లు ఇప్పుడు ‘ఎనిమీ’స్ గా ఎలా అలరిస్తారో చూడాలి.
Must Read ;- కిక్ దిగకముందే.. లైన్లో మూడు సినిమాలు










