టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు మరొక దర్శకుడి కథకు ఓకే చెప్పాడని సమాచారం. ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు రానున్నది ‘క్రాక్’ సినిమా.
దీని తర్వాత రవితేజ, నక్కిన త్రినాథ్ రావు దర్శకత్వంతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. నక్కిన త్రినాథ్ రావు తర్వాత రవితేజ, రమేష్ వర్మతో సినిమా చేయనున్నాడు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి మరొక క్రేజీ డైరెక్టర్ చేరిపోయాడు. అతడు మరెవరో కాదు కామెడీ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించగల మారుతి. ఈ మధ్యనే మారుతి, రవితేజను కలిసి ఒక వైవిధ్యమైన కథను వినిపించాడని టాక్. కథ విన్న మాస్ మహారాజా అందులోని ఎలిమెంట్స్ బాగా నచ్చి ఓకే చేసాడని సమాచారం.
దర్శకుడు రమేష్ వర్మ సినిమా తర్వాత మారుతీ సినిమా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు దర్శక నిర్మాతలు తెలియజేయ నున్నారు. ఈ లోగా మారుతీ ‘ఆహా’ ఓటీటీ సంస్థ కోసం ఒక వెబ్ సిరీస్ చేయనున్నాడు. అన్ని కుదిరితే.. రవితేజ మారుతి కలయికలో సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుందని ఫిల్మ్ నగర్ టాక్. నానీ, శర్వానంద్ లాంటి హీరోలకు పెక్యులర్ కేరెక్టర్స్ డిజైన్ చేసిన మారుతి.. రవితేజ కోసం ఏ తరహా పాత్రను డిజైన్ చేస్తున్నాడో అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. మరి మారుతి రవితేజ కాంబినేషన్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Miust Read ;- నక్కిన దర్శకత్వంలోనే మాస్ మహారాజా నెక్స్ట్ మూవీ?











