రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాకి తమిళనాడులో హైప్ మామూలుగా లేదు. ఆ హైప్ ఎంత అంటే అంటే ట్రైలర్ చూడకుండానే భారీ అడ్బాన్సు చెల్లించేంత అని చెప్పొచ్చు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమా తమిళ హక్కుల్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని కోసం అడ్బాన్సుగా భారీ మొత్తం చెల్లించినట్లు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక పాత్రను పోషించారు. బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మీద ఇంత క్రేజ్ పెరగడానికి కారణం రాజమౌళి గతంలో రూపొందించిన చిత్రాలే. ముఖ్యంగా బాహుబలి వసూళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా హక్కుల కోసం ఎగబడుతున్నారు. తమిళనాడులో ఈ సినిమా హక్కుల కోసం చాలామంది పోటీ పడినా చివరికి లైకా సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఈ సినిమా హక్కులు ఎంతకు దక్కాయో తెలుసా?.. అక్షరాలా 42 కోట్లు అంటున్నారు. చెన్నై సినీ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం ఈ మొత్తానికి హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో సగం అడ్వాన్సుగా ముందే చెల్లించేశారు. ఇంతకుముందు బాహుబలికి రూ. 47 కోట్లు దక్కాయి. ఒక విధంగా చెప్పాలి అంటే బాహుబలి కంటే ఇది చాలా తక్కువ మొత్తమే. ట్రైలర్ కూడా విడుదల చేయని సినిమా హక్కులకు ఇంత ధర పలకడానికి తమిళనాడులో రాజమౌళికి ఉన్న క్రేజ్ కూడా కారణమే. పైగా తమిళ నటుడు సముద్రఖని కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు.
Must Read ;- ‘ఆర్ఆర్ఆర్’ లో ఆలియా పాట పాడబోతుందా?