తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత జగన్. ఆస్తులన్ని తాను స్వయంగా కష్టపడి సంపాదించుకున్నవేనని చెప్పారు. ఆస్తులపై తన చెల్లెలు షర్మిలకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులూ లేవన్నారు. NCLTలో ఉన్న కేసులో తన తరపు వాదనలు వినిపించారు జగన్. ప్రేమతో కొన్ని ఆస్తులను చెల్లికి ఇవ్వాలని 2019లో నిర్ణయించుకున్నానని., కానీ తర్వాత షర్మిల రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ తన ప్రతిష్ఠను దెబ్బతీయడంతో ఈ ఒప్పందాలను అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు జగన్ చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పీలెట్ ట్రైబ్యునల్‌కి నివేదించారు.
నిజానికి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్ ఓ సబ్‌కాంట్రాక్టర్‌గా పని చేశారు. ఆ వ్యాపారం చేయడానికి కూడా డబ్బుల్లేవ్. దీంతో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అప్పులపాలై అప్పటికే హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు అమ్ముకోవడానికి అప్పటి ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ఆ స్థలం కమర్షియల్ గా అమ్ముకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అలాంటి పరిస్థితుల నుంచి 2004లో వైఎస్సార్ సీఎం అయిన తర్వాత జగన్ ఆస్తులు కొండల్లా పెరిగిపోయాయి. ఇక, సీఎం అయిన తర్వాత దేశంలోనే అతికొద్ది ధనవంతుల జాబితాలో చేరిపోయారు జగన్. సండూర్ పవర్ అనే కంపెనీ నుంచి అనేక కంపెనీలు పుట్టించి లెక్కలేనంత సొమ్ము వెనకేసుకున్నారు. ఐతే ఆ డబ్బంతా పెట్టుబడుల రూపంలో వచ్చిందే. అంటే ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించి..జగన్ పెట్టుబడుల రూపంలో లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలా సంపాదించిన సొమ్మునే తన కష్టార్జితం అని చెప్పుకుంటున్నారు జగన్. ఆ సొమ్ము నుంచి తల్లికి, చెల్లికి ఎలాంటి వాటాలు ఇచ్చేది లేదని చెబుతున్నారు.
తండ్రి సీఎం పదవిలో ఉన్న సమయంలో జగన్ అడ్డగోలుగా సంపాదించారు. దీనికి వైఎస్సార్ అప్పట్లో అండగా నిలిచారు. ఐతే అలా సంపాదించిన సొమ్ములో కూతురుకు భాగం ఇవ్వాలనుకున్నారు వైఎస్సార్. ఈ వ్యవహారాలన్ని అప్పట్లో విజయసాయిరెడ్డి చూసుకునేవారు. ఆస్తిలో షర్మిలకు భాగం ఇవ్వాలని వైఎస్సార్ విజయసాయిరెడ్డికి చెప్పారు. ఐతే టెక్నికల్ సమస్య వల్ల ఆ ఆస్తులన్ని జగన్ పేరు మీదే పెట్టామని, తర్వాత షర్మిలకు వాటా వచ్చేలా చూస్తామని చెప్పారు. వై.వి.సుబ్బారెడ్డి దీనికి సాక్ష్యంగా ఉన్నారని షర్మిల చెప్పారు. ఈ మేరకు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. కానీ తర్వాత జగన్, షర్మిల మధ్య ఎక్కడ తేడా కొట్టిందో ఆస్తులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో షర్మిల జగన్‌పై యుద్ధం ప్రకటించారు.
మొత్తంగా ఈ ఘటనలో NCLT ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానికంటే…జగన్ రెడ్డి వికృత వైఖరి బయటపడింది. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న జగన్ రెడ్డి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.










