No Updates Regarding Maheshbabu And Rajamouli Upcoming Movie :
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపొందనుందనే విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని డా.కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా ఉంటుందని.. స్వయంగా రాజమౌళి ప్రకటించడం జరిగింది. అంతే కాకుండా.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా ఉంటుందని ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో జక్కన్న చెప్పారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటే… ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు అనే వార్త బయటకు వచ్చింది.
కారణం ఏంటంటే.. రాజమౌళితో సినిమా చేయాలని మహేష్‌కీ, మహేష్‌తో పని చేయాలని రాజమౌళికీ గట్టిగానే ఉంది. మహేష్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ లాంటి కథ తయారు చేశాడని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ నవల హక్కుల్ని ఈ సినిమా కోసం కొన్నారన్న వార్తలూ వచ్చాయి. అయితే.. ఇప్పటి వరకూ మహేష్ కోసం కథ సెట్ కాలేదన్నది ఇన్‌సైడ్ వర్గాల టాక్. రాజమౌళి – మహేష్‌ల మధ్య ఈ కథకు సంబంధించి పలుమార్లు చర్చలు జరిగాయి. రాజమౌళి మూడు లైన్లు వినిపించాడు. అయితే అందులో ఏ ఒక్కటీ మహేష్ కి సంతృప్తినివ్వలేదని తెలుస్తోంది.
మన సినిమాకి ఇంకా టైమ్ ఉంది కదా… ఫర్లేదు మీరు కూడా టైమ్ తీసుకోండి. లేట్ అయినా ఫర్వాలేదు అని మహేష్ రాజమౌళికి చెప్పాడని టాక్ వినిపిస్తోంది. విజయేంద్రప్రసాద్ గత కొంత కాలంగా ఈ కథపైనే వర్క్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో సినిమా పూర్తవ్వడానికి మహేష్‌కి మరో యేడాదైనా పడుతుంది. సో.. 2022 చివర్లో రాజమౌళి – మహేష్ సినిమా మొదలు కావొచ్చు. లేదా 2023కి వెళ్లచ్చు. అందుకనే రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత ఓ చిన్న సినిమా చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. అదీ.. సంగతి.
Must Read ;- బిగ్ బాస్ 5 స్టేజ్ పై చెర్రీ ఆర్ఆర్ఆర్ ముచ్చట్లు











