జ్యోతి వెలిగింది.. ఒలింపిక్స్ మహా సంబురం అంబరాన్నంటింది. జులై 23న టోక్యోలో మొదలయ్యే ప్రపంచ వేడుకల ఆరంభం అందరినీ ఆకట్టుకునేలా సాగింది. గురువారమే టార్చ్ రిలే కార్యక్రమం షురూ అయ్యింది. 121 రోజులపాటు సాగే ఈ పండుగ కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. జపాన్‌లోని ఫకుషిమా ప్రాంతం నుంచి ఈ రిలే ఆరంభమైంది.
అజుసా సారథ్యంలో..
అజుసా ఈ జ్యోతిని తీసుకుని రాగా.. క్రీడాలోకం ఆమెను అనుకరించింది. 2011లో సునామీ వల్ల ఫకుషిమా తీవ్రంగా నష్టపోయింది. ఈ విపత్తులో సుమారు 18 వేల మంది ప్రాణాలొదిలారు. 2011 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన ఫుట్ బాల్ మహిళల జట్టులో కీలక సభ్యురాలు అజుసా.. ఇండోర్ సాకర్ శిక్షణ కేంద్రం నుంచి ఈ జ్యోతిని తీసుకొచ్చారు. మిగిలిన 14 మంది సభ్యులు, కోచ్ నోరియో ఆమెతో కలిసి ముందుకు సాగారు. కరోనా నేపథ్యంలో ఈసారి అభిమానులను అనుమతించలేదు.
కరోనా నేపథ్యంలో..
ఒలింపిక్ జ్యోతి రిలే ప్రతిసారి నామమాత్రంగా రోడో షో కోసం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ప్రతి ఒక్కరి దృష్టి టార్చ్ రిలేపైనే ఉంది. సామాజిక దూరం, మాస్క్ ధరించడం, పరిమిత ప్రేక్షకుల మధ్య గురువారం ఈశాన్య జపాన్‌లో అధికారికంగా ఒలింపిక్ టార్చ్ రిలేను ప్రారంభించారు. ఫుకుషిమాలోని జెవిలేజ్ స్టోర్స్ కాంప్లెక్స్‌లో ఈ రిలే ఆరంభమైంది. కరోనా నేపథ్యంలో చీర్ గాల్స్ లాంటి ఇతర ఏర్పాట్లను ఈసారి నిషేధించారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండానే ఈసారి ఒలింపిక్ రిలే షురూ అయ్యింది.
చీకటిని తరిమికొట్టే కాంతి కిరణం..
ఒలింపిక్ మాస్క్ ధరించడం, చీకటిని తరిమికొట్టే కాంతి కిరణం. ఈసారి ఒలింపిక్ టార్చ్ రిలేను సీరియస్‌గా తీసుకున్నాం. ఈ చిన్న జ్యోతి ఆశను ఎప్పుడూ సజీవంగా ఉంచుతుంది. హోప్ లైట్స్ అవర్ వే అనేది ఈ టార్చ్ నినాదం. టోక్యో ఒలింపిక్ క్రీడల గురించి ఇంకా ఆందోళన చెందుతున్న వ్యక్తులు ఉన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున ఈ క్రీడలను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Also Read:ఐపీఎల్ ప్రియులకు శుభవార్త.. ఇక మరింత మజా!
– టొషిరోముటో, ఒలింపిక్ రిలే ఇంఛార్జి