దాదాపు సంవత్సరకాలంగా కరోనా, కొవిడ్.. ఇంకా దానికి సంబంధించిన ఐసోలేషన్, క్వారంటైన్ అనే పదాలు తప్ప వేరే వినబడడం లేదు. కరోనా ఉధృతి కాస్త తగ్గింది.. కొత్త సంవత్సరం సరికొత్తగా ఉంటుందిలే అనుకుంటున్న సమయంలో బ్రిటన్‌లో కొత్తరూపు సంతరించుకున్న కరోనా అందరి ఆశలపై నీళ్లు చల్లింది. కొత్త సంవత్సరాన్ని ఈ కొత్తరకం కరోనాతో స్వాగతించాల్సిన అగత్యం పట్టింది. ఇప్పుడు అందరిలో మొదలైన మరొక టెన్షన్ ఏంటంటే.. ఈ కొత్త కరోనా లక్షణాల మామూలు కరోనాలాగా ఉంటాయా లేదా ఏమన్నా మార్పులు ఉంటాయా అనేది అందరి మనుసులో మెదులుతున్న ప్రశ్న.. మరి ఈ కొత్త కోరోనా సరికొత్త లక్షణాలేంటో తెలుసుకుందాం రండి..
కొత్త కరోనా కొంచెం ఎక్కువే!
మామూలు కరోనా లక్షణాలు మనకు తెలిసినవే విపరీతమైన జ్వరం, పొడి దగ్గు, శ్వాస సమస్యలు తలెత్తడం, వాసన, రుచి వంటి లక్షణాలు కోల్పోవడం. వీటితో పాటు మరో ఏడు లక్షణాలు కూడా జత చేరాయి ఈ కొత్త కరోనా లక్షణాల లిస్ట్ లో..
Also Read ;- కొత్తరకం కరోనా గురించి షాకింగ్ నిజాలు బయటపెడుతున్న శాస్త్రవేత్తలు

- అనునిత్యం నీరసంగా అనిపించడం.
- ఆకలిని వేయకపోవడం.
- తీవ్రమైన తలనొప్పి.
- వాంతులు, విరోచనాలు
- కండరాల నొప్పులు
- చర్మంపై దద్దుర్లు
- ఏ కారణం లేకుండా ఆందోలన చెందడం.
ఈ లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే టెస్ట్‌లు చేయించుకోవడం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. చలికాలం కనుక కొందరికి మామూలుగా జలుబు లాంటివి చేయడం వల్ల వాసనను కోల్పోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పటికే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మొదటగా వ్యాధికి సంబంధించి నిర్ధారణ చేసుకున్న పిమ్మట.. సమస్య దాని వల్ల కాదు అని తెలిసినపుడే కొవిడ్ పరిక్షకు వెళ్లడం మంచిది.
జాగ్రత్తలు మరవకండి..
లక్షణాలు కొత్తవి జతచేరినా.. నివారణ చర్యలు మాత్రం పాతవాటినే కాస్త ఎక్కువ అప్రమత్తతతో పాటించమని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్‌ని దగ్గరపెట్టుకోవడం లాంటివి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌తో పాటు ఫేస్ షీల్డ్, చేతికి గ్లౌస్ లాంటి వాటిని తప్పక ధరించాలని సూచిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడం అన్నింటికంటే ముఖ్యమంటున్నారు అధికారులు.
ఆహార్య ప్రాముఖ్యత
అంతా మనం తీసుకునే ఆహారంలోనే ఉంటుంది. మితంగా తీసుకుంటే ఆరోగ్యం.. అమితంగా తీసుకుంటే విషం.. ఈ డైలాగ్ ప్రస్తుత పరిస్థితికి అతికినట్లు సరిపోతుంది. ఏంటి మితంగా ఎందుకు అనుకుంటున్నారా? ఊబకాయుల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన, మితమైన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా మన భారతీయులు వంటల్లో వాడే కొన్ని ప్రత్యేక పదార్థాలు అల్లం, పసుపు, మిరియాలు యాంటీబాడీలను పెంచుతాయి. అంతేకాదు, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పస్తాయి. అంతేనా.. ఎన్నో రోగాలను మొగ్గలోనే తుంచేచి మీకు రక్షణ కల్పిస్తాయి. వీటితో పాటు పండ్లు, రోగనిరోధక శక్తిని పెంచే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎలాంటి రోగమైనా దాసోహం అనాల్సిందే. కాబట్టి ఈ కొత్త కరోనాకి మన హెల్తీ ఫుడ్‌తో చెక్ పెట్టేద్దాం.
Must Read ;- భారత్‌లోనూ మొదలైన కొత్త కరోనా ప్రకంపనలు











