ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో విఫలమైన వైసీపీ ఎంపీలకు పదవుల్లో కొనసాగేందుకు అర్హత లేదని టీడీపీ మండిపడింది. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఆపార్టీ తరఫున పనబాక లక్ష్మి ఇవాళ నామినేషన్ వేశారు. అంతకు ముందు నెల్లూరు నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు తదితర టీడీపీ నాయకులు పనబాక లక్ష్మికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో వైసీపీ విఫలమైనందున ఢిల్లీలో బలంగా ఏపీ గళం వినిపించేందుకు పనబాక లక్ష్మిని గెలిపించాలని వారు కోరారు.
Must Read ;- లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!