లాస్ట్ ఇయర్.. డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మలయాళ మూవీ ‘కప్పేళ’. రోషన్ మ్యాథ్యూ, అన్నా బెన్ జంటగా నటించిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ లో విశ్వక్ సేన్, నవీన్ చంద్ర హీరోలుగా నటిస్తుండగా.. ఎన్నో మలయాళ, తమిళ చిత్రాల్లో బాలతార గా మెరిసిన మలయాళ కుట్టి అనిఖా సురేంద్రన్ ఈ సినిమాతో హీరోయిన్ గా మారబోతోంది.
ఒరిజినల్ వెర్షన్ లో అన్నా బెన్ చేసిన పాత్రను తెలుగులో అనిఖా పోషించనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాకి ఇతర కేస్టింగ్ , సాంకేతిక నిపుణుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. అలాగే.. దర్శకుడు ఎవరూ అనే విషయంలోనూ ఇంకా క్లారిటీ లేదు. ఇక ‘కప్పేళ’ తెలుగు వెర్షన్ కు ‘బుట్టబొమ్మ’ అనే క్యాచీ టైటిల్ ను రిజిస్టర్ చేశారట. ఈ సినిమా ముఖ్యంగా.. కథానాయిక ప్రధాన్యత కలిగిన సినిమా కాబట్టి.. ఆ టైటిల్ నే ఖాయం చేయాలనుకుంటున్నారట. అల వైకుంఠపురములో సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘బుట్టబొమ్మ’ అనే పదం తెగ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ టైటిల్ .. సినిమాకి కూడా ప్లస్ అవుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి మలయాళ ముద్దుగుమ్మ తెలుగు బుట్టబొమ్మలా ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.
Must Read ;- మెగా ‘ఆచార్య’లో సిద్ధకు తోడుగా బుట్టబొమ్మ