రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటిపోతుంది. ఎన్నికల సంఘం ఒక వైపు, రాష్ట్రం ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఒక వైపు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎన్నికల కమీషన్ పంచాయతీ నోటిఫికేషన్ విడదల చేసిన తక్షణం ఉద్యోగ సంఘాలు రోడ్లెక్కాయి. ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామి రెడ్డి ఎన్నికల కమిషన్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రాణాపాయం వస్తే ఎదుడివాడిని చంపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. సుప్రీం కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది. టీకాలు ఇచ్చేంత వరకు విధుల్లో పాల్గొనం. మా ప్రాణాలు రక్షించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. కరోనా నుంచి రక్షణ అంటే టీకా. మేము అదే కదా అడుగుతున్నాం. వ్యాక్సిన్ ఇచ్చాక మేము రామంటే ఉద్యోగంలో నుంచి తీసేయండి. కానీ వ్యాక్సిన్ ఇవ్వకుండా విధుల్లోకి వచ్చేది లేదు. మీరేమన్నా చేసుకోండి. సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేదు. వ్యాక్సిన్ ఇచ్చి రమ్మంటే విధుల్లోకి వస్తాం. ఇప్పుడే ఈ పరిస్థితి రావడానికి కారణం కరోనా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఇది మా ప్రాణాలకు సంబంధించినది. సస్పెండ్, డిస్మిస్ అంటూ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఎన్నికల కమిషనర్.
పట్టాభి రామ్ కౌంటర్..
ఇన్నిరోజులు కరోనా గుర్తుకురాలేదా.. వ్యాక్సిన్ వచ్చేంత వరకు విధులకు రామని ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేకపోయారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగానే అందరి నోర్లు లేస్తున్నాయి. ఒక పనికిమాలిన నాయకుడు.. తాపేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయిపోయి మాట్లాడుతున్న నాయకుడు.. చంపుతానంటూ మాట్లడే ఇలాంటి వాళ్లంతా ఉద్యోగ సంఘాల నాయకులుగా వ్యవహారిస్తున్నారు. అసలిలాంటి వాడిని ఏమనాలి? అసలు ఎవర్ని చంపుతావురా నువ్వు? ఎన్నికల కమిషనర్‌ని చంపుతావా? తీర్పిచ్చిన న్యాయవాదుల్ని చంపుతావా? అసలు బుర్రుండి మాట్లాడుతున్నావా? ఈ రాష్ట్రానికి ఒక ఫ్యాక్షనిష్టు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను చంపమంటే చంపుతావా? ఇలా రోడ్డుపైకి వచ్చి ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసే హక్కు నీకెక్కడుంది. వెంకట్రామి రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ.. అతని మాటల్ని తీవ్రంగా తప్పు బట్టారు పట్టాభి రామ్.
కేసు పెట్టిన ఎన్నికల కమిషన్..
మీడియా ముఖంగా ఎన్నికల కమీషనర్‌ని ఉద్దేశించి చంపుతాను అన్నట్లుగా మాట్లాడిన, ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామి రెడ్డిపై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. అతని చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయుండి రాజ్యంగం పట్ల బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలకు తెగబడిన వెంకట్రామి రెడ్డిపైన చర్యలు తప్పవని తెలియవస్తుంది.
Also Read: షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?











