వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ముందుగా గుర్తుకవచ్చేది అండర్ వరల్డ్ మాఫియా సినిమాలే. సత్య, కంపెనీ సినిమాల్లో మాఫియా గురించి కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. ఇటీవల కాలంలో తెలుగు రాష్గ్రాల్లో జరిగిన సంఘనటలు ఆధారంగా సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు మళ్లీ తన దృష్టిని బాలీవుడ్ వైపు పెట్టాడు. ముంబైకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా డి-కంపెనీ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు.
డి – కంపెనీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు డీ కంపెనీ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చేశాడు. చూస్తుంటే.. ఓ చిన్న గ్యాంగ్ లీడర్ స్ధాయి నుంచి అండర్ వరల్డ్ ని శాసించే స్ధాయికి ఎలా ఎదిగాడు అనేది ఇందులో చూపించినట్టుగా తెలిస్తుంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అలాగే ఈ వెబ్ సిరీస్ కు కూడా కథ కన్నా ఎక్కువుగా కెమెరా వర్క్ ను, మ్యూజిక్ నే నమ్ముకున్నట్టుగా అనిపిస్తుంది.
వర్మ సినిమాల్లో డైలాగులు తక్కువుగా ఉంటాయి. యాక్షన్ ఎక్కువుగా ఉంటుంది. ఇది కూడా అలాగే ఉంది. ఈ వెబ్ సిరీస్ గురించి వర్మ స్సందిస్తూ.. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలియచేస్తూ.. మహా భారతంతో పోలుస్తూ.. మహా భారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్ పెట్టారు. ఐదు భాషల్లో త్వరలో రిలీజ్ చేయనున్నారు. మరి.. ఈ డీ కంపెనీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read : వర్మకు షాకిచ్చిన హైకోర్టు
Here is D COMPANY telugu version teaser ..The true story of the BAAP of GANGSTERS https://t.co/TziCAJrw4F produced by SPARK
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2021