సెన్సేషనల్ స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్.. కథలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో. ఆయన కథలు ఎంతటి సంచలనం సృష్టిస్తాయో తెలిసిందే. ఆయన రాసిన కథలతో రూపొందిన బాహుబలి, భజరంగీ భాయ్ జాన్.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. దీంతో విజయేంద్రప్రసాద్ కథలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. పవన్ అంటే విజయేంద్రప్రసాద్ కు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే.. బాహుబలి ఇంటర్వెల్ సీన్ కి పవన్ కళ్యాణే స్పూర్తి. ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ స్వయంగా ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు.
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. మరో వైపు ఇదే లోకేషన్ లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే.. పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పక్కనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా జరుగుతుందని తెలుసుకుని వెళ్లి రాజమౌళిని కలిశారట. దాదాపుగా గంటసేపు వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పవన్ తో రాజమౌళి సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి.
మరో వైపు విజయేంద్రప్రసాద్ పవన్ కోసం కథ రెడీ చేస్తున్నారని తెలియడంతో.. పవన్ – రాజమౌళి కాంబినేషన్ సెట్ అయ్యిందని.. టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాకి చాలా తక్కువ రోజులు మాత్రమే డేట్స్ ఇస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఎక్కువ రోజులు డేట్స్ కావాలి. అందుచేత వీరిద్దరకి సెట్ కాదని గతంలో వార్తలు వచ్చాయి. మరి.. రాజమౌళికి పవన్ ఎక్కువ రోజులు డేట్స్ ఇస్తారా..? ప్రచారంలో ఉన్నట్టుగా ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందా..? లేదా..? విజయేంద్రప్రసాద్ రాసిన కథతో పవన్ సినిమా చేస్తే.. అది రాజమౌళి డైరెక్టర్ చేస్తారా..? లేక వేరే డైరెక్టర్ కోసమా..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.











