పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. కరోనా కారణంగా కొన్ని ఏరియాల్లో కొద్ది పాటి నష్టాలు ఏర్పడినప్పటికీ.. ఈ సినిమాను అభిమానులకు ఐ ఫీస్ట్ గా మలచడంలో బాగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఒరిజినల్ లోని సోల్ ఎక్కడా మిస్ అవకుండా.. పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని అతడి చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి. అలా చేయడంలో వేణుకి దిల్ రాజు పూర్తి స్వాతంత్రం ఇచ్చాడని తెలుస్తోంది.
అందుకే దిల్ రాజు మరోసారి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే వేణుని పవర్ స్టార్ కోసం ఒక మంచి కథాంశాన్ని రెడీ చేయమని చెప్పారట. ఆ మేరకు వేణు ప్రస్తుతం కథ రాసేపనిలో ఫుల్ బిజీగా ఉన్నాడట. త్వరలోనే వేణు పవన్ కి కథ వినిపించబోతున్నాడట.
అలాగే.. దిల్ రాజు మరో ఇద్దరు దర్శకుల్ని కూడా పవన్ కోసం కథలు రాయమని పురమాయించాడని టాక్. వాటిలో పవన్ కు ఏ కథ నచ్చితే ..ఆ సినిమాను మొదలు పెట్టేందుకు దిల్ రాజు సిద్ధంగా ఉన్నాడట. మరి వేణు ఈ సారి పవన్ కోసం ఏ కథాంశాన్ని ఎంపిక చేసుకుంటాడో చూడాలి.
Must Read ;- వేమూరి రాధాకృష్ణ భార్య మృతికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం